Sunday, April 28, 2024

AP: జులై 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ.. పేదలకు మెరుగైన వైద్యం

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో : దేశంలో సూపర్‌ స్పెషాలిటీ- వైద్యం ఏ విధంగా అందుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు- కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే స్పష్టం చేశారు. బుధవారం అనంతపురం పర్యటనకు వచ్చారు. అంతకుముందు కేంద్ర సహాయ మంత్రికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూపర్‌ స్పెషాలిటీ- ఆస్పత్రిలోని గ్రౌండ్‌ ప్లnోర్‌లో ఎక్స్‌ రే, ఆల్ట్రా సౌండ్‌, కన్సోల్‌ గదిని, మొదటి అంతస్తులో ఐసీయూ కాంప్లెక్స్‌, రెండవ అంతస్తులో నాడీ శస్త్రచికిత్స ఐపీ వార్డు, తదితర విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు.

ఆమె మీడియాతో మాట్లాతూ..దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు- చేయడం జరిగిందని, అందులో ఆంధ్ర రాష్ట్రంలోని మంగళగిరిలో ఒక ఎయిమ్స్‌ ఏర్పాటు- చేయడం జరిగిందన్నారు. మంగళగిరిలో ఏర్పాటు- చేసిన ఎయిమ్స్‌లో ఒక ఏడాది నుంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు- తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్‌ను ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా కూడా ఎయిమ్స్‌ ఏర్పాటు- చేయడం జరిగిందన్నారు.

దేశంలో ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఇతర దేశాల నుంచి మాత్రమే మన దేశానికి అందేవన్నారు. అయితే తొలిసారిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మన శాస్త్రవేత్తలు మనదేశంలోనే కేవలం 11 నెలల వ్యవధిలోనే కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇలాంటివి గతంలో ఎన్నడూ జరగలేదని, బయట దేశాల నుంచే వ్యాక్సిన్లు పొందేవారమన్నారు. ఏ రకమైన వ్యాధుల-కై-నా ఒకటి నుంచి రెండు సంవత్సరాల తర్వాతే మందులన్నీ భారత్‌కు వచ్చేవన్నారు. అలాంటి స్థితి నుంచి ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్‌ ను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందన్నారు.

కరోనా సమయంలో పారాసిటమోల్‌ మాత్రలు కూడా అమెరికాలో లేవని, మన దేశం నుంచి పారాసిటమోల్‌ మాత్రలు ఇతర దేశాలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. అంతేకాక దేశం నుంచి పళ్ళు, పాలతోపాటు-, పుష్పాల్లాంటి నిత్యావసర సరుకులు కూడా ఇతర దేశాలకు అందించడం జరిగిందన్నారు. అలాగే మందులతోపాటు- వెంటిలేటర్‌ లను కూడా ఇతర దేశాలకు సరఫరా చేశామన్నారు.దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి అందిందన్నారు. ఉచితంగా 180 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు అందించామన్నారు. ఇందులో మొదటి డోసు 97 శాతం, రెండవ డోసు 87 శాతం, బూస్టర్‌ డోస్‌ 20 కోట్లు- అందించామని తెలిపారు. ఎక్కువ శాతం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందజేయడంతో ఇతర దేశాలతో బేరీజు వేసుకుంటే భారత దేశంలో కరోనా మరణాలు తక్కువగా నమోదయ్యాయన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా భారీ నుంచి ప్రజలను రక్షించేందుకు ఎంతగానో ఖర్చు చేశారన్నారు. గత ఏడాది కరోనా వ్యాక్సిన్‌, రీసెర్చ్‌ ల కోసం 35 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌ లో కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆత్మ నిర్బర్‌ భారత్‌ దిశగా మన దేశం నిలిచిందని, వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, -టె-క్నీషియన్లు, పారామెడికల్‌ సిబ్బందిని ప్రతి జిల్లాలో ఎంత అవసరమో అంత మేరకు ఏర్పాటు- చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు- రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడ్పాటు- అందించాలన్నారు. అన్ని రాష్ట్రాల్రతో కలిసి కేంద్రం పని చేయాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు-ను రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో చూపించాల్సి ఉందన్నారు.

- Advertisement -

దేశంలో ఏ రాష్ట్రం వెనుకబడి ఉందో దాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వచ్చేందుకు దేశ ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ వై కె నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరిం-టె-ండెంట్‌ సుధాకర్‌, ఆర్డీఓ మధుసూదన్‌, ఏపీఎంఎస్‌ఐడిసి ఈఈ రాజగోపాల్‌, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement