Thursday, May 2, 2024

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోటోను ముద్దాడిన జెసి ప్రభాకర్ రెడ్డి

అనంతపురం, ఏప్రిల్ 30 ప్రభ న్యూస్ బ్యూరో అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రోజురోజుకు వేడి ఎక్కుతుంది. ప్రజా సొమ్మును దోచుకుంటున్నది నువ్వంటే నువ్వు అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్ ఇష్టానుసారంగా సొంతానికి వాడుకొని కోట్ల రూపాయలు దిగమింగారంటూ ఇద్దరు నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు తయారుచేసి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు కట్టించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఒక ఫ్లెక్సీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్దకు తీసుకెళ్లి నిరసన చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గజదొంగ అని విమర్శించడమే కాకుండా, తన గుండెల్లో తాడిపత్రి ప్రజలు ఉన్నారని చొక్కా విప్పి ప్రదర్శించారు. పెద్దారెడ్డి ఫోటోను ముద్దాడరు.

https://fb.watch/kdISnUVrhR/?mibextid=NnVzG8

Advertisement

తాజా వార్తలు

Advertisement