Thursday, May 2, 2024

వాల్మీకి రామాయణం.. భావి తరాలకు మార్గదర్శకం

వాల్మీకి మహర్షి అందించిన రామాయణం భవిష్యత్తు తరాలకు మార్గ దర్శకం అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కె) అన్నారు. వాల్మీకి మహర్షి జయంతోత్సవాల సందర్భంగా మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రబాలెం పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కె మాట్లాడుతూ… వాల్మీకి మహర్షి  లేనిదే రామాయణం లేదని… రామాయణం లేనిదే రాముడు లేడని అందరూ భావిస్తుంటారన్నారు. సంస్కృతంలో మొట్టమొదటగా శ్లోకాలు రాసి ప్రపంచానికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. వాల్మీకి మహర్షి ఎంత శ్రద్ధ, భక్తి, కష్టంతో చరిత్రను ప్రపంచానికి అందించాలని చేసిన ప్రయత్నంలో భాగమే రామాయణం అని,  తరతరాలు ప్రపంచ ప్రజలంతా గొప్పగా చెప్పుకునే కథగా రామాయణం చరిత్రలో నిలిచి పోవడం మనందరికీ గర్వకారణమన్నారు. అత్యంత నమ్మకస్తులు, ప్రేమాభిమానాలు కలిగినవారు వాల్మీకి బోయ కులస్తులని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే తపన కలిగిన వారని చెప్పారు. 

వాల్మీకి బోయలు పిల్లలను కష్టపడి చదివించాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పేద,ధనిక అని తారతమ్యం లేకుండా విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల కన్నా మిన్నగా ప్రభుత్వ పాఠశాలను సమాజానికి అందిస్తున్నారని చెప్పారు. విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని గుర్తించి చదువుకుంటే  ప్రతి ఒక్కరికీ  ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్యాణానంద స్వామీజీ,బీసీ సంక్షేమ సంఘ నాయకులు పరసా రంగనాథ్, పట్టణ వైసీపీ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, గ్రామ వైసీపీ అధ్యక్షులు గుండాల శ్రీనివాసరావు, పీఏసీఎస్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు దానబోయిన నాగయ్య,పలగాని కోటేశ్వరరావు, మేరిగ నాగేశ్వరరావు, వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాయకులు  ఎం. ఆంజనేయులు, అరికటిక కార్పోరేషన్ డైరెక్టర్  కోవెలకారు శివరామ్ బాబాజీ, నల్లబోతుల సాంబయ్య  తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: IND VS PAK: జోరుగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement