Friday, April 19, 2024

TS: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌ లెస్‌ జర్నీ.. డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా యత్నాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మారుతున్న కాలానికి త‌గ్ట‌ట్లు ప్రయాణికుల సేవలలోనూ మార్పులు తీసుకురావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు. సంస్థ ఎండీగా చార్జ్‌ తీసుకున్నప్ప‌టి నుంచి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సజ్జనార్‌ ప్రస్తుతం ఆర్టీసీ అనుసరిస్తున్న విధానాలను సమూలంగా మార్చేందుకు నడుం బిగించారు.

కాలానుగుణంగా మారాల్సిన ఆర్టీసీ ఎప్పటి నుంచో అమలవుతున్న పాత విధానాలను నేటికీ కొనసాగిస్తోంది. దీంతో సేవలలో ఆలస్యం, సమాధానంలో నిర్లక్ష్యం కారణంగా క్రమక్రమంగా ప్రయాణికులు దూరమవుతున్నారు. సంస్కరణలంటే గిట్టని అధికారులలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్టీసీ పాతకాలపు విధానాలనే ఇంకా అమలు చేస్తోంది.

సేవలన్నింటినీ నగదు రూపంలోనే అందించడం, అదీ వినియోగదారుడిదే బాధ్యత అన్న ట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కొన్ని సందర్బాల్లో చిల్లర లేదని, టికెట్‌ ధర ఎంతో అంత మేర చెల్లించాల్సిన బాధ్యత మీదేనన్న సమాధానాలతో కొంత మంది ఆర్‌టీసీకి దూరమవుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎండీ ఇక నుంచి అన్ని బస్టాండ్లు, బస్టేషన్లు, రిజర్వేషన్‌ కౌంటర్లతో పాటు కీలకమైన లావాదేవీలు సాగే అన్నిచోట్ల తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పేమెంట్లను అమలు చేయాలని నిర్ణయిం చారు.

కొద్ది రోజుల క్రితం కొన్ని పరిమిత ప్రాంతాల్లో యూపీఐ పేమెంట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన యాజమాన్యం త్వరలోనే అన్ని చోట్ల ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్లతో పాటు ఆర్టీసీ అధీకృత డీలర్ల వద్ద కూడా ఆన్‌లైన్‌ పేమెంట్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కొన్ని ఆధీకృత డీలర్ల వద్ద ఇప్పటికే యూపీఐ పేమెంట్లు అమలవు తున్నప్పటికీ ఆర్టీసీ మాత్రం నగదు రూపంలోనే స్వీకరిస్తోంది.

అంతేకాకుండా రైల్వే శాఖ అమలు చేస్తున్నట్లుగా కొన్ని ప్రధాన బస్టాండ్లు, రద్దీ బస్టాం డ్లలో కియాస్క్‌ సెంటర్లను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వే షన్‌ విధానంలోనే సీట్‌ రిజర్వేషన్‌లు వర్తిస్తున్నాయి. ఇక నుంచి ముందుగా టికెట్లను బుక్‌ చేసుకున్న అన్ని రూట్ల ప్రయాణికులకు సీట్ల రిజర్వేషన్‌లను వర్తింప చేసే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవ్లిుబన్‌, జూబ్లి బస్టాండ్‌లతో పాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లాంటి రద్దీ బస్టాండ్‌లలో దూర ప్రాంతాలకు వెళ్ళే వారి సౌకర్యార్థం కియాస్క్‌లను కూడా అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement