Sunday, April 28, 2024

మూడు రాజధానులపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్య

మూడు రాజధానులపై ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రభుత్వ విధానం అని అన్నారు. దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా వచ్చి తీరుతుందన్నారు. మూడు రాజధానుల బిల్లుకు డెడ్ లైన్ అంటూ ఏమి లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం విధానం కాబట్టి మేము ఆలోచన దిశగా సాగుతున్నామని మంత్రి బొత్స తెలిపారు.

కాగా, మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ లో వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ దశలో అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది. అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికి 700 రోజులు దాటింది. రెండున్నరేళ్లుగా మూడు రాజధానులపై భీష్మించుకొని కూర్చున్న సీఎం జగన్.. కొద్ది రోజులు క్రితం ఎట్టకేలకు బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement