Monday, April 29, 2024

ఐఐటీ హైద‌రాబాద్ తో – బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ కీల‌క ఒప్పందం

బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ ..ఐఐటీ హైద‌రాబాద్ తో కీల‌క ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ తెలిపారు. బసవతారకం ఆసుపత్రి, ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని వెల్ల‌డించారు. ఉమ్మడి కార్యాచరణ కోసం రెండు సంస్థలు ఓ అవగాహనకు వచ్చాయ‌ట‌. కొత్త కోర్సు ప్రవేశపెట్టేందుకు జరిగిన ఒప్పందంపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి, బసవతారకం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.సుబ్రమణేశ్వర్ సంతకాలు చేశారని బాలకృష్ణ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement