Monday, May 13, 2024

పోర్న్ సైట్ లో ఆ పని చేస్తున్న లెక్కల టీచర్.. ఇదేం ప‌ని అంటున్న నెటిజ‌న్లు..

ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు.. ఒక్కొక్క‌రు ఒక్కోలా ఉంటారు. వారి ఆలోచనా విధానం చాలా ఢిప‌రెంట్‌గా ఉంటుంది. కొంతమంది అయితే అందరు ఎట్లుంటే నాకేంటి.. నా స్టేలే వేరు అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇంకొంత మంది సాదా సీదాగా ఉంటూ.. తోచిందే ప‌ని అన్న‌ట్టు న‌డుచుకుంటారు. ఇట్లా డిఫరెంట్ గా ఉంటూ.. వాళ్ల ఆలోచ‌న ధోర‌ణితో ఆక‌ట్టుకునే వాళ్లుంటారు.. కొన్ని సార్లు ఆ విధానంతో ఫెయిల్ అయిన వాళ్లు ఉంటారు.. మ‌రి ఈ లెక్క‌ల మాస్టారు ఏం చేశారో తెలుసుకుంటే అంద‌రూ అవాక్క‌వాల్సిందే..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇంకాస్త డిఫ‌రెంట్ అనే అనుకోవాలి.. మాథ్య్స్ చెప్పాలంటే ఎవ‌రైనా పోర్న్ సైట్‌ను ఎంచుకుంటారా.. అస్స‌లు ఆ సైట్‌లో లెక్క‌లు ఎవ‌రైనా వింటారా.. అని ప్ర‌శ్నిస్తే.. అవును వింటార‌నే అంటాడు ఈ మాస్టారు. ఎవరైనా పోర్న్ సైట్ లో పాఠాలు చెప్తారా.. ఈ ఆలోచ‌నే చాలా డిఫ‌రెంట్‌గా ఉంది కదా.. అందుకే ఈ టీచ‌ర్ ఆ మార్గాన్ని ఎంచుకున్నార‌ట‌.. డిఫెరెంట్ గా ఆలోచించిన చాంగ్​షూ మాత్రం పోర్న్ హబ్ నే తన స్కూల్ గా మార్చుకున్నాడు. పోర్న్ వీడియోలు ప్లే అవుతున్న చోటే తన మ్యాథ్స్ క్లాసు వీడియోలు పోస్ట్ చేశాడు.

సరే అత‌ని పిచ్చి అత‌నిది అనుకుందాం.. మ‌రి పోర్న్ సైట్ లో ఎవరు మ్యాథ్స్ వీడియోస్ చూస్తార‌నుకుంటే పొరబడినట్లే.. రోజూ చాంగ్​షూ మ్యాథ్స్ క్లాస్ కి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దీంతో మనోడు పోర్న్ హబ్ తో పటు మిగతా అశ్లీల సైటలన్నింటిలోను అకౌంట్ ని ఓపెన్ చేసి లెక్క‌ల‌ క్లాసులు చెబుతున్నాడు. ఇట్లా అతను ఏడాదికి దాదాపు రూ.2 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడట‌.

దీనిపై చాంగ్‌షూ స్పందిస్తూ.. తైవాన్ లో అద్భుతంగా మ్యాథ్స్ నేర్పించే ఒక టీచర్ ఉన్నాడని ప్రపంచం మొత్తం తెలియడానికే ఈ విధంగా చేశాను. పోర్న్ హబ్ లో మ్యాథ్స్ క్లాసులకు వచ్చిన రెస్పాన్స్‌ మరెక్కడా రాలేదు.. అందుకే నేను ఇంకా ఎదగాలని మిగతా అశ్లీల సైటలన్నింటిలోను అకౌంట్ తెరిచి క్లాసులు మొదలుపెట్టాను అంటూ వివరించాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా పోర్న్ సైట్ కి వెళ్లి మరీ మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు అంటే సాహసమనే చెప్పాలని నెటిజన్లు కామెంటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement