Monday, May 20, 2024

మంత్రాలయం: రమణీయం రాఘవేంద్రుని పట్టాభిషేకం మహోత్సవం..

మంత్రాలయం, (ప్రభ న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పట్టాభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తిర్థులు ఆద్వర్యంలో శుక్రవారం రమణీయంగా సాగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వెలిసిన మంత్రాలయం క్షేత్రంలో శుక్రవారం 401 పట్టాభిషేక మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. గురు వైభవోత్సవాలలో భాగంగా శ్రీ గురు రాఘవేంద్రులు సన్యాసం స్వీకరించి నేటికి 401 సంవత్సరాలు కానున్న తరుణంలో గురు వైభవ మహోత్సవం వేడుకలు పురస్కరించుకుని పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష అభి షేకాలు పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, స్వర్ణ కవచాలు, బెంగుళూరు నుంచి వచ్చిన ప్రత్యేక పూలతో బహు సుందరంగా అలంకరించారు.

శ్రీ రాఘవేంద్ర తీర్థుల పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శ్రీ మఠం ప్రాకారంలో అశేష భక్త జనం మధ్య ఉయ్యాల మంటపం నందు స్వర్ణ సింహాసనం పై, శ్రీ రాఘవేంద్రుల స్వర్ణ పాదకులను వుంచి, ముత్యాలు, వెండి నాణ్యాలు, వివిధ ప్రత్యేక పుష్పాలతో అభిషేక మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారి పాదకులను, శ్రీ మన్న్యాయ సుధా పరిమళ గ్రంథాలను, శ్రీ రాఘవేంద్రుల వెండి ప్రతిమను బంగారు రథం పై ఉంచి అశేష భక్త జన హర్ష ధ్వనుల మధ్య, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటల మధ్య కన్నుల పండుగగా ఊరేగించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గురువైభోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు:
శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనేందుకు కర్ణాటక సినీ నటుడు హీరో సుదీప్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు సోమయాజులు, రఘునందన్, వెంకటరమణ, ధర్మాస్థలం ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement