Sunday, May 19, 2024

సీఎం జ‌గ‌న్ తో భేటీకానున్న మంచు విష్ణు

మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు మరి కాసేపట్లోనే.. ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. సినిమా టికెట్ల అంశంతో పాటు.. మరిన్ని ఇతర విషయాలు, ఇండస్ట్రీ సమస్యలపైన ఆయన జగన్ తో చర్చించే అవకాశముంది. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు.. మొదటిసారి సీఎం జగన్‌ను కలవనుండడం.. ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు విష్ణు.. విజయవాడకు ఎందుకు వెళ్లారు.. సీఎం జగన్ తో ఏం మాట్లాడతారు.. సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెడతారా.. మీడియాకు ఏం చెబ్బబోతున్నారు.. టాలీవుడ్ పెద్దల సమావేశంపై ఎలాంటి కామెంట్లు చేయబోతున్నారు.. అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే.. జగన్ తో చిరంజీవి సమావేశాన్ని పర్సనల్ గా చెప్పుకొచ్చిన విష్ణు.. చాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలే టాలీవుడ్ లో ఫైనల్ అని.. చాంబర్ ప్రతినిధులతోనూ ప్రభుత్వం తప్పక చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టమైన కామెంట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా…ఇటీవ‌లే చిరంజీవితో కలిసి టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడం.. తర్వాత మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మాట్లాడడం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement