Wednesday, March 22, 2023

కర్నూల్ స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ గెలుపు..

కర్నూలు – కర్నూల్ స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1136 ఓట్లు పోలవగా, ఇందులో డాక్టర్ మధుసూదన్ కు 988 ఓట్లు వచ్చాయి, సర్పంచుల సంఘం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి మోహన్ రెడ్డికి 85, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డికి 10 ఓట్లు పోలయ్యాయి. మరో 53 ఓట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల లోపే ఫలితాలు వెలువడటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement