Sunday, April 28, 2024

ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించారు. నవంబర్‌ 16న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 10న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement