Thursday, May 2, 2024

Tirupati: ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వం.. భూమున

తిరుపతి సిటీ, జూన్ 23 (ప్రభ న్యూస్): నగర ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వకుండా చేసేందుకు 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లను నాలుగు, రూ.18.20 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చింతల చేను, ఉపాధ్యాయ నగర్, మున్సిపల్ ప్రకాశం పార్క్, ఎం.ఆర్ పల్లి, మారుతి నగర్ ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరెంట్ కష్టాలు పోవాలనే సదుద్దేశంతో 33 కెవి సబ్ స్టేషన్లకు నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు ఆదం రాధాకృష్ణారెడ్డి, ఎస్.కే.బాబు, ఆంజనేయులు, తదితరులు తిరుపతి ఆపరేషన్ డి.ఇ.వాసుదేవ రెడ్డి, ఏ.డీ.ఈ.ఆంజనేయులు, ఏఈలు ముని రామ్, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాముల రమేష్, దొడ్డ రెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement