Sunday, April 28, 2024

AP: నాయకులే జంపింగ్ జపాంగ్ లు… నారా లోకేష్

శ్రీ సత్యసాయి బ్యూరో, మార్చి7 (ప్రభ న్యూస్) : స్వర్గీయ ఎన్టీ రామారావు ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఏమోగానీ పార్టీలో నాయకులు మారినా కార్యకర్తలు మాత్రం మారకుండా ఉంటూ వస్తున్నారు. పార్టీ కోసం పనిచేయడమే వారికి తెలుసు తప్ప, ఇతర ఏమీ కార్యకర్తలకు తెలియదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నారా లోకేష్ కార్యకర్తలను కొనియాడారు. గురువారం శంఖారావం రెండవ విడత కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బీ కే పార్థసారథి అధ్యక్షత వహించగా.. నారా లోకేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

సీఎం జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేష్…
రాష్ట్రం పట్ల తనకు ఒక విజన్ ఉందని ఒక ప్రిజనర్ (నేరస్తుడు) చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాధారణంగా జైలుకు వెళ్లిన నేరస్తులకు ఏమి అలవాట్లు ఉంటాయో అందరికీ తెలిసిందేనన్నారు. ఇందులో భాగంగానే వైయస్ జగన్ కు కటింగులు, సెట్టింగులు కటింగ్ లు, ఫిటింగ్ లు అలవాటు పడ్డాయి. అందుకే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అనేక రకాల పథకాలను కటింగ్ చేశారు. ముఖ్యంగా చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక వంటివి ఉన్నాయన్నారు. ఫిటింగ్ విషయానికి వస్తే బల్లపై రూ.10 ఇచ్చి, బల్లకింద రూ.100 లాక్కోవడం జరుగుతోంది. అదేలా అంటే విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, అధిక మద్యం ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ధరలు ఆకాశాన్ని అంటిస్తున్నాయని నారా లోకేష్ విమర్శించారు. ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పడితే, ప్రజా పాలన తెలుగుదేశం పాలన రావడం తద్యమన్నారు.


టీడీపీ అధికారంలోకి…
రాబోయే రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా రంజక పాలన అందించడం జరుగుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రధానంగా ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున‌ ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యం అన్నారు. ఇదే సందర్భంలో నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్య కోసం ప్రతి ఇంటికి ఏడాదికి 15,000 చొప్పున ముగ్గురు ఉన్నా కూడా 45,000 ఇస్తామన్నారు. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామన్నారు. ఇదే సందర్భంలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ప్రతినెలా 1500 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి రూ.90,000 అందివ్వడం జరుగుతుందన్నారు. ఇంకా బీసీలకు డిక్లరేషన్ ప్రకటించి 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement