Wednesday, May 8, 2024

పిఆర్సి ఆందోళనకు భవన నిర్మాణ కార్మికుల మద్దతు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ,ఉపాధ్యాయులు, కార్మికుల జేఏసి పిఆర్సి సమస్యలపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన, ఇతర నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ కడప జిల్లా కన్వీనర్ ఎ. రామమోహన్, కో-కన్వీనర్ పాటిల్ చంద్రారెడ్డి sతెలిపారు. సోమవారం కడప పాత బస్టాండ్లో ఉన్న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు.

కొత్త పిఆర్సి వస్తే ఉద్యోగుల జీతాలు పెరగడం గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయంగా ఉందని వారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనికి భిన్నంగా జీతాలు, ఇంటిఅద్దె భత్యం, కరువు భత్యాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఫిబ్రవరి 7 నుండి తలపెట్టిన సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. సమ్మె జరిగితే అందుకు జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికయినా ప్రభుత్వం సమ్మెను నివారించేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగుల జేఏసీ చేపట్టే పోరాటాల్లో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యేక్షంగా పాల్గొంటారని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement