Saturday, May 18, 2024

Kurnul – జగన్ అన్న పాలనలో కల్తీ మద్యం హోరు – మరణాలు జోరు: షర్మిల

కర్నూల్ బ్యూరో – రాష్ట్రంలో 25 శాతం లిక్కర్ మరణాలు పెరిగాయని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని తన్విష్ కన్వీనియన్స్ హాల్లో కర్నూల్, నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు జే.లక్ష్మీ నరసింహ యాదవ్, కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బాబురావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిలమ్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం మరణాలు పెరిగినట్లు చెప్పారు.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… ఈ మరణాల శాతం అధికమన్నారు.

రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చల విడిగా అమ్ముతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ పాపం మొత్తం వైయస్ జగన్ ప్రభుత్వం దే అన్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు ఉండవట అన్నారు. ఇష్టం వచ్చిన ధరలకు మద్యం అమ్ముతూ తమ సొంత ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు.ఆంధ్రలో భూం భూం, లాంటి బ్రాండ్ లు అమ్ముతున్నారు.. ఈ బ్రాండ్లు ఎక్కడ లేవన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాలేదు కానీ…స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం అమ్మడం ఇంతకన్నా దారుణం మరేది లేదన్నారు.

నచ్చింది కాదు..అమ్మింది కొనాలి…చెప్పిన రేటుకి కొనాలి అన్నట్లుగా ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో వ్యవహరిస్తుందన్నారు. ఈ దేశంలో,ప్రపంచంలో ఎక్కడ కూడా ఓన్లీ క్యాష్ విధానం కూడా లేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.మద్యం అమ్మకాల్లో నచ్చిన వాళ్ళకే టెండర్లు…వాళ్ళే అమ్మాలి… వాళ్ళు పెట్టిన రెట్లకే అమ్మాలన్న తీరితే వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మద్యం కల్తీ పై కనీసం తనిఖీలు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ఆంధ్రలో ఎంత మద్యం అమ్ముతున్నారు వాటికి నేటి వరకు లెక్కలు లేవు అన్నారు.ఆడిట్ లేదు… తనికీలు అంతకన్నా లేవని ఆమె వ్యంగంగా స్పందించారు. ఎంత ఆదాయం వస్తుంది తెలియదన్నారు. ఇలాంటి వాటిపై కేంద్రం నుంచి ఒక విచారణ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.కాగ్ రిపోర్ట్ లు లేవు… సిబిఐ దర్యాప్తు లేదన్నారు. ఇంత అవినీతి జరుగుతున్న…బీజేపీ ప్రభుత్వం కనీసం దర్యాప్తు కూడా చేయదన్నారు.వైయస్సార్ పాదయాత్ర ఇచ్ఛాపురం లో పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.అదే ఇచ్ఛాపురం నుంచి తన కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రస్థానం మొదలు పెట్టినట్లు షర్మిల పేర్కొన్నారు. కర్నూల్ జిల్లా వేదికగా జిల్లాల సమావేశం ఇక్కడే పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇవ్వాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవం తీసేశారు : నేడు ఆంధ్ర ప్రజల నిర్ణయానికి గౌరవం లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

గెలిచింది వైసిపి అయితే రాష్ట్రంలో అనధికారికంగా రాజ్యం ఏలేది బిజెపి అన్నారు.బాబు నుంచి జగన్ దాకా బీజేపీ కి తొత్తులుగా ఆమె పేర్కొన్నారు. పాలక పక్షం,ప్రతిపక్షం బీజేపీ కి బానిసలన్నారు. బీజేపీ తో వైఎస్సార్ ఏనాడూ ఏకీభవించలేదనీ షర్మిల తెలిపారు. వైఎస్సార్ జీవితం మొత్తం బీజేపీ కి వద్ద వ్యతిరేకమన్నారు. మత ఘర్షణలను రేపి చలి కాచుకునే తత్వం బీజేపీ దిగా ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగిన చంద్రబాబు బీజేపీ క్యాబినెట్ లో దూరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా పై దీక్షలు చేసిన జగన్ ఆన్న …అధికారంలో వచ్చాకా ఒక్కరోజు కూడా హోదా కోసం పోరాటం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

రాష్ట్ర అభివృద్ధికి 10 ఏళ్లలో ఒక్క నిజమైన పోరాటం చేయలేదని ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన బీజేపీ పట్టించుకోలేదన్నారు. విభజన హామీలు ఒక్కటి ఇవ్వలేదు కదా…కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం ఆంధ్ర రాష్ట్రం కు ఇంతకన్నా బాధాకరం మరొకటి లేదన్నారు. 25 మంది లోక్ సభ…6 మంది రాజ్యసభ ఎంపీ లు ఉండి…హోదా తేలేక పోవడాన్ని ఆమె తప్పు పట్టారు.ఇంతమంది ఉండి ఎందుకు. .? మీకు అధికారమని ఆమె ప్రశ్నించారు.

హోదా వచ్చి ఉంటే…పెద్ద పెద్ద పరిశ్రమలు ఏపీకి వచ్చి ఉండేవన్నారు. పన్ను రాయితీ ద్వారా… పరిశ్రమలు వచ్చి… లక్షల్లో ఉద్యోగాలు ప్రజలకు వచ్చేవన్నారు. ఈ 10 ఏళ్లు రాజధానికి కూడా దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకరు అమరావతి అన్నారు…మరొకరు…3 రాజధానులు అన్నారు.కర్నూల్ ను న్యాయ రాజధాని చేస్తా అన్నారు..అయ్యిందా న్యాయ రాజధాని ? అని ఆమె ప్రశ్నించారు.

మన రాష్ట్ర భవిష్యత్ పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.వైఎస్సార్ సంక్షేమానికి ,జగన్ ఆన్న పాలన కు పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆకాశానికి,పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్సార్ హయాంలో రైతు రాజు. ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు..కనీసం పంట భీమా కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.

వైఎస్సార్ హయాంలో 50 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తే, ప్రస్తుతం 19 లక్షల మంది నిరుద్యోగులు గా మారారన్నారు.జనవరి 1 న జాబ్ క్యాలెండర్ హామీ నేటి వరకు నెరవేరకపోవడం బాధాకరమన్నారు.ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు నోటిఫికేషన్ లు ఇస్తే…ఉద్యోగాలు ఇచ్చేది ఎన్నడని షర్మిల ప్రశ్నించారు.వైఎస్సార్ హయాంలో హంద్రీనీవా,ప్రాజెక్ట్ కట్టారు ఇవ్వాళ్టి కి 10 శాతం పనులు మిగిలి ఉంటే జగన్ ఆన్న అవి పూర్తి చేయలేదన్నారు.గాలేరు – నగరి ప్రాజెక్ట్ పనులు 50 శాతం పెండింగ్ ఉంటే… నేటికీ పూర్తి చేయకపోవడం దురదృష్టకరమన్నారు.- ఆంధ్ర రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement