Saturday, October 12, 2024

Kurnul – సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సు

కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఉత్తర్వుల మేరకు కర్నూలు దిశా పోలీసు స్టేషన్ డిఎస్పీ ఐ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు , సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల లో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన పై విద్యార్దులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఐ. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు, యువకులు అనవసర లింక్‌లను క్లిక్‌ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై , గుర్తుతెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, చాటింగ్‌కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దన్నారు.

తమ వ్యక్తిగత, బ్యాం కింగ్‌ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, కేవైసీలను అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూ డదన్నారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నం బర్‌కు డయల్‌ చేయాలన్నారు

.అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి , యువత చెడు అలవాట్లవైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్దులు మొదటి నుంచే దూరంగా ఉండాలన్నారు. మహిళ ల పై జరిగే నేరాలు ,ఈవ్ టీజింగ్, మహిళా చట్టాలు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశా యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు దిశా పోలీసుస్టేషన్ సిఐ కళా వెంకటరమణ, జిల్లా స్పోర్ట్స్ సి ఈ ఓ రమణ, సెయింట్ జోసఫ్ కళాశాల అకాడమిక్ డీన్ వై. శౌరీలు రెడ్డి, ప్రిన్సిపల్ డా. కె. శాంత, ఉప ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ సి వి సత్యనారాయణ, సాంస్కృతిక సాహిత్య కమిటీ ఇంచార్జ్ ఆశా పర్వీన్, మహిళ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement