Friday, May 17, 2024

Kurnul – బిజేపి, జన సేన పొత్తు కొనసాగుతుంది – పురంధేశ్వరి

కర్నూలు, జనవరి 21, ప్రభ న్యూస్ బ్యూరో. వైసిపి ప్రభుత్వ చేత కాని తనం వల్ల రాష్ర్టంలో అభివృద్ధి కుంటూ పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందరేశ్వరి అన్నారు. ఆదివారం నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు అధ్వర్యంలో సౌజన్య ఫంక్షన్ హాల్ లో శక్తి కేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమె టిడిపి,వైసిపి ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృధి పై దృష్టి పెట్టి ప్రపంచదేశాలు మనవైపు చూసే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేశారన్నారు.ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టు బడి ఉందన్నారు.రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి బలం,రాజకీయ కార్యాచరణ పై చర్చించేందుకు నంద్యాలకు వచ్చానని అమె పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు.

వైసిపి ప్రభుత్వం ఆడుకుందాం రా కాదు ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందనీ ఆమె పేర్కొన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకొని కేంద్రం పదకాలు హైజాక్ చేశాయని ఆరోపించారు. ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటుకు బిజేపి నిధులు ఇచ్చిన విషయంను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.అయోధ్యలో బలరాముడు విగ్రహ ప్రతిష్ట కు అన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు.

బిజేపి,జన సేన పొత్తు కొనసాగుతుందని,తెలుగుదేశంతో పొత్తు అధిష్టానం చూసుకుంటుందన్నారు. బిజేపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందని అభియోగం మోపుతున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అధికారులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా . సహకరిస్తుందని చెప్పిన విషయం గుర్తుచేశారు. ఓటరు లిస్ట్ అవకతవకలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాశామన్నారు.తిరుపతి బై ఎలక్షన్ లో వైసిపి నాయకులు 35 వేల దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆ సంఘటనలో ఒక ఐఎఎస్ అధికారి సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. వైసిపి నాయకులతో కుమ్మక్కై అధికారులతో పాటు కారణమైన వైసిపి నాయకులపై గట్టి చర్యలు తీసుకునే విధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పంపించామ న్నారు.

శ్రీశైలం అభివృద్ధికి రూ.43 కోట్ల నిధులు కేంద్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ఉచిత గ్యాస్,హైవే నిర్మాణాలు, విమానాశ్రయాలు,కొత్త రైల్వే మార్గాలు,సోలార్ ప్రాజెక్టులు,జాతీయ రహదారులు ఏర్పాటు బీజీపీ కృషి ఫలితమే అన్నారు. వందే మాతరం ఎక్స్ ప్రెస్ రైళ్లు తీసుకొచ్చిన ఘనత బీజీపీ కి దక్కుతుందన్నారు.బనగానపల్లి లో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.కొలిమిగుండ్ల మండలంలో నాపరాళ్ళ గనులకు రాయితీ 10 శాతం నుంచి అయిదు శాతం కు తగ్గిస్తామని హామీ ఇచ్చిన జగన్ నేటికీ అమలు చేయలేదన్నారు.

- Advertisement -

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం దశాబ్దాల కల సాకారమైంది ,విగ్రహ ప్రతిష్ట అందరూ తిలకించాలన్నారు. శ్రీశైలంలో శివయ్య ను దర్శించుకొని రాముని విగ్రహ ప్రతిష్ట లైవ్ లో తిలకిస్తానన్నారు. బిజేపి బలమైన శక్తిగా ఎదగాలని,అవినీతి మరక లేకుండా ,కుటుంబ వారసత్వం లేకుండా సేవా దృక్పదం తో ముందుకు సాగుతుందన్నారు. ,ప్రజలు బిజెపి నీ ఆదరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. నంద్యాలలో బిజెపి నాయకుల్లో కొత్త ఉ త్సాహం,అంకిత భావంతో బైరెడ్డి శబరి,భూమా కిషోర్ రెడ్డి,అభిరుచి మధుతో పాటు కార్యకర్తలు,అభిమానులు వున్నారని బిజెపి విజయం దిశగా అడుగులు వేయాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో పార్లమెంట్ లోని అసెంబ్లీ కన్వీనర్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement