Saturday, April 27, 2024

రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్ …

కర్నూలు జిల్లా కోసిగి రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ధ్వంసం అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోసిగి నుండి ఉరుకుంద వైపు బండల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ రైల్వే గేటును ఢీ కొనడంతో ఉరుకుంద ఈరన్నకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన రైల్వే గేటు దగ్గరకు చేరుకొని ట్రాఫిక్‌ను అతికష్టం మీద క్లియర్ చేశారు. అయితే రైల్వే గేట్ మ్యాన్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి.. కోసిగి స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. గేటు మ్యాన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement