Thursday, April 25, 2024

శ్రీశైలం మల్లన్న సేవలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వై. చంద్రచూడ్

శ్రీశైలం , శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున వారి ఆలయ సందర్శన నిమిత్తం నేడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ వై. చంద్రచూడ్ కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా భ్రమరాంబ అతిధి గృహం వద్ద ధనుంజయ వై. చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్ వార్లక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ కె.సుజన, దేవాదాయశాఖ కమీషనర్ యం. హరి జవహర్ లాల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కర్నూలు ఎన్. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలు ఘన స్వాగతం పలికారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ వై. చంద్రచూడ్ వెంట సుప్రీంకోర్టు జడ్జి పిఎస్ .నరసింహ ఆయన సతీమణి సత్యప్రభలు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రధాన అధికారులు, ఆలయ అధికారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం వారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement