Sunday, April 28, 2024

NITI Ayog – సామాజిక అభివృద్ధిపై ప్రజంటేషన్ ఇచ్చిన కర్నూల్ కలెక్టర్ సృజన

కర్నూలు, డిసెంబర్ 28, ప్రభాస్ న్యూస్ బ్యూరో.ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సామాజిక అభివృద్ధిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన ప్రజంటేషన్ ఇచ్చారు..నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంశంపై జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 26 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది…. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలోని 5 రాష్ట్రాల నుండి 5 జిల్లాల కలెక్టర్ లు ఎంపిక అయ్యారు.. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి 5 గురు జిల్లా కలెక్టర్ లు హాజరు కాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఈ సమావేశాలకు హాజరయ్యారు.

.ఇందులో భాగంగా గురువారం ప్రధానమంత్రి ముందు కలెక్టర్ జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ, రక్తహీనత పరీక్షల నిర్వహణ, రక్త హీనత నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యాభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు..కర్నూలు జిల్లా తెలంగాణ,కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు జంక్షన్ గా ఉన్న జిల్లా అని, హైదరాబాదు, బెంగళూరు లాంటి అభివృద్ధి చెందిన ప్రదేశాలకు మధ్యలో ఉన్న జిల్లా, వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా అని జిల్లా గురించి కలెక్టర్ పరిచయం చేశారు…..

కర్నూలు జిల్లా లో హోళగుంద, మద్దికెర, చిప్పగిరి ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషనల్ బ్లాక్స్ గా గుర్తించిందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో సి ఈ ఎస్ ప్రకారం 70 శాతం సీజనల్ గా వలసలు వెళుతున్నట్లు గుర్తించిందన్నారు.. వెనుకబాటు తనం వల్ల బాల్య వివాహాలుజరుగుతున్నాయన్నారు..ఈ సమస్యకు కారణం నిరక్షరాస్యత,పేదరికం,మూఢనమ్మకాలు కూడా ఒక కారణమన్నారు..జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ తెలిపారు.

..గత ఆర్థిక సంవత్సరంలో 60 (96.7 శాతం) బాల్యవివాహాలను ఆపగలిగామన్నారు.. గ్రామ సచివాలయాలు చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ యూనిట్లుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హోళగుంద సమీపంలోని పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మలను ఉదాహరణగా కలెక్టర్ వివరించారు. నిర్మల… చాలా తెలివైన అమ్మాయి అని, పదవ తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిందని, ఈ అమ్మాయి తన కుటుంబ నేపథ్యం కారణంగా కాలేజీకి వెళ్లకుండా వ్యవసాయ కూలీ గా పనికి వెళ్తూ పెళ్లికి సిద్ధ పడవలసి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని బాల్య వివాహాన్ని నిరోధించి ఇంటర్మీడియట్ చేర్పించి చదివించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. .తల్లిదండ్రులకు సరియైన అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు..గ్రామ సచివాలయాల ద్వారా జూన్,జూలై, ఆగస్టు మాసాల్లో ఇంటింటికీ వెళ్లి 5 నుండి 18 ఏళ్ల బాలికలను గుర్తించి, 11,000 మంది బాలికలను స్కూల్ కి రప్పించ గలిగామని కలెక్టర్ తెలిపారు..వలస వెళుతున్న విద్యార్థులకు 71 సీజన్ వసతి గృహాలను ఏర్పాటు చేశామని, అనీమియా – ముక్త జిల్లాగా తీర్చిదిద్దేందుకు 86 శాతం బాలికలకు అనీమియా టెస్టులను నిర్వహించామని, అందులో 42 శాతం మంది బాలికలకు రక్తహీనత ఉందని గుర్తించి, వారికి న్యూట్రిషన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించడం, డీ వార్మింగ్ చేయగలిగామని కలెక్టర్ తెలిపారు.

వీటితో పాటు విద్యా కానుక ద్వారా స్కూల్ కిట్స్, అమ్మఒడి ద్వారా 15 వేల రూపాయల సహాయం వంటి పథకాల ద్వారా విద్యార్థులు విద్యకు దగ్గర అవుతున్నారని తెలిపారు..కళ్యాణమస్తు , షాది తోఫా ల ద్వారా లక్ష రూపాయల సహాయంతో పాటు 10 వ తరగతి పూర్తి చేయాలన్న నిబంధన వల్ల బాల్యవివాహాలను అరికట్టడానికి వీలవుతోందని కలెక్టర్ వివరించారు..బాలికా విద్యను మరింత ప్రోత్సహించే విధంగా, జిల్లాలో మరింత మంది నిర్మల లను చూసే దిశగా చర్యలు తీసుకోవడం తో పాటు ఆరోగ్యకరమైన, సామాజిక, ఆర్థికాభివృద్ధి తో కూడిన జిల్లాగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తన ప్రజంటేషన్ ద్వారా వివరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement