Saturday, February 4, 2023

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు చర్యలు – బుగ్గన

?ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే. ?ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు ?లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలని ప్రజలకు విజ్ఞప్తి ?పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

కర్నూల్ బ్యూరో, – ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.సోమవారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ అతిధి గృహ సమావేశ మందిరంలో కోవిడ్ కట్టడి చర్యల పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్బంగారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని వారితో సమీక్ష నిర్వహించడం జరిగిందని, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అవసరాలు ప్రభుత్వ సహాయ సహకారాలు, తదితర వివరాలను సేకరించడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకొని పరీక్షించి, లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసి హాస్పిటల్ కి పంపించి మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆదోని హాస్పిటల్ లో త్వరలో 15 రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల హాస్పిటల్లో మూడువారాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తాం అన్నారు. ప్రజలతో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే 45 సంవత్సరాల లోపు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా బాధితుల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇచ్చారని, పెద్ద మనసుతో ఇవ్వడం చాలా సంతోషం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉదయనంద్ హాస్పిటల్ లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నియంత్రణకు అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ కరోనా కట్టడి చేస్తున్నారన్నారు. కరోన వైరస్ తో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే పిల్లలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూపిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్, ఇంజెక‌్షన్‌లపై అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. ఆక్సిజన్ పై ప్రతినిత్యం మానిటరింగ్ చేస్తూ తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్నామని, ఆక్సిజన్ కొరత ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలి అన్నారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే ప్రమాదమే. లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించి మంచి వైద్య సేవల పొందాలన్నారు. కరోన విపత్కర సమయంలో డాక్టర్లు, నర్సులు ఎంతో ఓపికతో మంచి సేవలు అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి ఒక్కరికి చికిత్సతోపాటు భోజనం, మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం అన్ని కల్పిస్తోందిన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కన్నా కర్నూలు జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్ లో వసతులు బాగా ఉన్నాయిని, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో రోగులకు మనోధైర్యాన్ని నింపుతు… నాణ్యమైన భోజనంతో పాటు మందులను ఇచ్చి వైద్యులు కౌన్సెలింగ్‌ ఇస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా, ధ్యానం నేర్పిస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి రోగి ఆరోగ్యంపై ఆరా తీస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇంత బాగా చేస్తున్నా… కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారులకు, సిబ్బందికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభినందనలు తెలియజేశారు. బ్లాక్ ఫంగస్ సంబంధించి కర్నూలు జిజిహెచ్ లో లక్షణాలు ఉన్న బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అని, అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా రికవరీగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement