Thursday, April 25, 2024

థియేటర్స్ లో మాత్రమే బజార్ రౌడీ!!

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం బజార్ రౌడీ సినిమా తీస్తున్నాడు. వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ కూడా రెండు మిలియన్ల వ్యూస్ సంపాదించింది.

ఇదిలాఉండగా మారుదురీ రాజా రాసిన మాటలు హైలెట్ గా నిలవబోతున్నాయని నిర్మాత అన్నారు. అలానే సీనియర్ ఎడిటర్ గౌతంరాజు, ఎ. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ చేశారని అన్నారు. బజారు రౌడీ సినిమా థియేటర్లో మాత్రమే విడుదల చేస్తామని నిర్మాత నందిరెడ్డి శ్రీనివాస్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement