Monday, April 29, 2024

ఎస్సీ ఎస్టీ కేసుల‌పై ఎస్పీ వీడియో కాన్ఫ్ రెన్స్…

కర్నూలు, – జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎస్సీ ఎస్టీ కేసుల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.. పోలీసు అధికారులతో పెండింగ్ కేసుల గురించి చర్చించారు. పోలీసు అధికారులు ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ సంధర్బంగా ఎస్పీ ఎస్సీ, ఎస్టీ కేసుల పై ఆరా తీసి, పలు సూచనలు చేశారు. ఎస్సీ , ఎస్టీ కేసులు నమోదైన సంధర్బాల్లో అధికారులు సత్వరం స్పందించాలని , విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఆయా సబ్ డివిజన్ల నుండి పోలీస్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement