Friday, April 26, 2024

అంధులతో వినూత్నంగా క‌రోనాపై అవ‌గాహ‌న‌ కార్యక్రమం

ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ….
అంధులతో ప్రయాణికులకు, పాదాచారులకు కౌన్సిలింగ్ ఇప్పించిన…. జిల్లా ఎస్పీ
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోనే కరోనాను అరికట్టగలం
బస్సులు ఆపి మాస్కులు ధరించని ప్రయాణికులకు మాస్కులు అందజేసిన ఎస్పీ .

కర్నూలు, – కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒమేగా హాస్పిటల్ వద్ద ఆర్టీసి బస్సులలో మాస్కులు ధరించకుండా ప్రయాణిస్తున్న ప్రజలకు, పాదాచారులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మాస్కులు అందజేశారు. ఇదే సంద‌ర్బంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్కులు ధరించాలని వినూత్నంగా అంధులచే కోవిడ్ జాగ్రత్తల గురించి ఫ్లకార్డులు పట్టుకొని లౌడ్ స్పీకర్లలో ప్రయాణికులకు, పాదాచారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు మూడవ పట్టణ సిఐ తబ్రేజ్, అంధ అధ్యాపకులు విశ్వనాథ రెడ్డి, ప్రకాష్, అశోక్, నాగభూషణ్ రెడ్డి, అనిల్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement