Thursday, May 16, 2024

ఘనంగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జన్మదిన వేడుకలు

నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థ రెడ్డి 29వ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి, రాజకీయ నిప్పు కెరటం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పుట్టిన‌రోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో 27వ వార్డ్ కౌన్సిలర్ సమీరా భాను, వార్డ్ ఇంచార్జ్ ఉస్మాన్ భేగ్, 12 వ వార్డు కౌన్సిలర్ లాలూ ప్రసాద్ ఆధ్వర్యంలో బాలింతలకు, రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేయగా, 1 వ వార్డ్ కౌన్సిలర్ కాటేపోగు చిన్నరాజు ఆధ్వర్యంలో వైకాపా నాయకులు మార్కెట్ రాజు, అశోక్, కిషోర్, పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అల్పాహారం అందజేశారు.
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు :
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి ప‌లువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైస్ చైర్మన్ లు అర్షపోగు ప్రశాంతి, కో- ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి, అబ్దుల్ గఫార్ కౌన్సిలర్ లు అబ్దుల్ హమీద్, చాంద్ భాష, కాటెపోగు చిన్న రాజు, అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, అల్లురి క్రిష్ణ, లాలు ప్రసాద్, చెరుకు సురేష్, మనపాడు అశోక్, మందడి వాణి, యం.సమీర భాను, కొండ్రెడ్డి విజయమ్మ, జె.రాధిక, షేక్ రేష్మ‌‌‌, యం.కరీష్మా, యం.లక్ష్మిదేవి, వీరబొమ్మ రూపాదేవి, చింత లక్ష్మిదేవి, పి.శాంత కుమారి, కె.క్రిష్ణవేణి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement