Tuesday, October 8, 2024

ఆస్పత్రుల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ కోటేశ్వరరావు

కర్నూలు ప్రతినిధి, ప్ర‌భ న్యూస్ : జిల్లాలో నాడు నేడు కింద చేపడుతున్న ఆస్పత్రుల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సిహెచ్సి, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాల పురోగతిపై వైద్యాధికారులు, ఇంజనీర్ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా ఆస్పత్రులు, కోడుమూరు, ఆదోని పీహెచ్సి లను బలోపేతం చేసేందుకు చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ apsmidc అధికారులను ఆదేశించారు. అలాగే 8 అర్బన్ హెల్త్ క్లినిక్స్, 354 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాల పనులను కూడా వేగవంతం చేయాలని సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు.. మరో 76 హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలకు ఎస్టిమేషన్ లను రూపొందించాలని సూచించారు. ఆదోని మెడికల్ కళాశాల, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పనుల గురించి కలెక్టర్ apsmidc ఈఈ రాజ గోపాల్ రెడ్డితో ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ వో రామ గిడ్డయ్య, డిసిహెచ్ఎస్ రాంజీ నాయక్, పంచాయితీ రాజ్ శాఖ ఎస్ ఈ సుబ్రమణ్యం, ఈ ఈ మద్దన్న, ఆర్ అండ్ బి ఎస్ ఈ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement