Monday, April 29, 2024

కర్నూల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వార్షిక త‌నిఖీ..

కర్నూల్ ప్రతినిధి : వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్.సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కలిసి గురువారం ఉదయం తనిఖీ చేశారు. ముందుగా పోలీసు గార్డు సిబ్బంది డీఐజీకి గౌర‌వ వందనం చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా డీపీవోలోని అన్ని విభాగాల పనితీరు గురించి డీజీపీ సమీక్షించారు. DPO, ఆర్మ్ డు రిజర్వుడు, డీసీఆర్బి రికార్డుల నిర్వహణ గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్షిక పనితీరు, నివేదికల గురించి అడిగి తెలుసుకున్నారు. సంతృప్తిని వ్యక్తం చేశారు. డీసీఆర్బీ విభాగంలో మహిళల పై జరిగే నేరాలు, ఎస్సీ ఎస్టీ నేరాలు, ఇతర ముఖ్యమైన రికార్డుల డేటాను పరిశీలించారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ ఉండే విధంగా చూడాలన్నారు. ఎఆర్ విభాగంలో డిపాజిట్ చేసిన ఆయుధాల డేటా, మోటార్ ట్రాన్స్ పోర్టు(MTO), స్పెషల్ పార్టీ & PSOలు, మాబులేషన్, BD టీం, మినరల్ వాటర్, జిమ్, పోలీసు క్వాటర్స్, పరేడ్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీలో ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, డిపిఓ ఎఓ సురేష్ బాబు, డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement