Saturday, May 11, 2024

2nd Test : మొదటి ఇన్నింగ్స్ 227 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 73.5 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు పది వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు మోమినుల్ హక్ 84 పరుగులు, ముష్పికర్ రహీమ్ 26 పరుగులు, లిటన్ దాస్ 25 పరుగులు, శాంటో 24 పరుగులు చేశారు. భారత్ జట్టు బౌలర్లు ఉమేష్ యాదవ్ నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ లు నాలుగు వికెట్ల చొప్పున తీయగా, జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement