Friday, May 3, 2024

విశాల్.. లాఠీతో విజ‌యాన్ని అందుకున్నాడా..!

జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా త‌మిళ హీరో విశాల్ డిఫ‌రెంట్ జోన‌ర్ లో సినిమాల‌ని చేస్తుంటాడు. తాజాగా విశాల్‌ న‌టించిన మ‌రో డిఫరెంట్ మూవీ లాఠీ. గత కొంతకాలంగా విశాల్ సినిమాలన్నీ బోల్తా పడుతూనే వస్తున్నాయి. ఎనిమి, చక్ర, అయోగ్య ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడులా విశాల్ ప్రయత్నిస్తున్నాడు. మ‌రి లాఠీ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థేంటంటే..నారాయణ గూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న ముర‌ళీ కృష్ణ (విశాల్‌) నీతి ,నిజాయితీకు మారుపేరు. ఓ రేప్ కేసులో అనుమానితుడికి కొంచెం గట్టిగా లాఠీ ట్రీట్మెంట్ ఇవ్వటంతో సస్పెండ్ అవుతాడు. అయితే అతని సిన్సియారిటీ తెలిసిన డీఐజీ క‌మ‌ల్‌ (ప్ర‌భు) రికమెండేషన్ తో బయటపడి డ్యూటీలో చేరుతాడు. అయితే డీఐజీ ఓ ఫేవర్ అడుగుతాడు. లాఠీ ట్రీట్మెంట్ ని ఓ క్రిమినల్ కు ఇవ్వటమని అడుగుతాడు. కారణం… డీఐజీ కూతుర్ని సిటీలోని పెద్ద రౌడీ శూర కొడుకు వీర అవ‌మానించటమే. దాంతో ముర‌ళీ కృష్ణ‌తో వీరాని చావ చితకకొట్టించాడన్నమాట. అంతవరకూ బాగానే ఉంది. కానీ దెబ్బలు తిన్న వీరా ఊరుకుంటాడా…అతను దాన్ని మ‌న‌సులో పెట్టుకుని త‌న‌ను కొట్టిన కానిస్టేబుల్ పై ప‌గ ప‌డ‌తాడు. ముర‌ళీ కృష్ణ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు ముర‌ళీ కృష్ణ ఏం చేశాడు.. శూర‌, వీరాల‌నుంచి త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే లాఠీ చిత్రం చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ.. ఓ సాధారణ కానిస్టేబుల్.. ఉద్యోగ విధుల్లో భాగంగా పై అధికారి ఒత్తిడితో ఓ పెద్ద గ్యాంగస్టర్ తో విరోథం తెచ్చుకుంటే …అతనికి రక్షణ ఇచ్చేదెవరు..డిపార్టమెంట్ అతని వెనక నిలబడుతుందా తనను రెచ్చగొట్టిన అధికారి అయినా సపోర్ట్ ఇస్తాడా అనే ఆసక్తికరమైన ఎలిమెంట్ ని స్టోరీ లైన్ గా తీసుకున్నారు. ఇదంతా సినిమా ప్రారంభమైన పది నిముషాల వరకే అనిపిస్తుంది. ఆ తర్వాత మిగతాదంతా రెగ్యులర్ రొటీన్ రొట్ట కొట్టుడుగా మారిపోతుంది. హీరోయిజం, విలనిజం…ఫైట్స్ అన్నట్లు సాగిపోతుంది. అయితే అదే సమయంలో ఓ సందేహమూ వస్తుంది. విలన్ … త‌న‌ను కొట్టించిన పైఅధికారి ని కాకుండా… చెబితే కొట్టిన కానిస్టేబుల్‌పై ప‌గ‌బ‌డుతాడెందుకో అర్థం కాదు. ఇక స్క్రీన్ ప్లే ఎంత డల్ గా ఉంటుందంటే ఆ ట్విస్ట్ , టర్న్ ఇట్టే గెస్ చేసేయగలుగుతాము. ఏమి కొత్తగా అనిపించదు..ఓటిటిలలో అదిరిపోయే క్రైమ్ మూవీస్ వస్తున్న ఈ టైమ్ లో ఇంకా ఇలాంటి సీన్స్ తో కూడిన సినిమాలు రావటం ఆశ్చర్యమనిపిస్తుంది.

టెక్నికల్ …ఈ సినిమా మొదట కథ,స్క్రీన్ ప్లే విషయంలోనే ఫెయిలైంది. దాంతో మిగతా విభాగాలు ఆ ఫెయిల్యూర్ ని అనుసరించాయి. ఈ బోర్ కొట్టే స్టోరీలో డైలాగులు అక్కడక్కడా మెరుపులా బాగున్నాయి. అలాగే సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ …బాగుంది. చివరి దాకా కూర్చోపెట్టేలా చేసింది. అయితే అంతోటి టెక్నిషియన్ కూడా కొన్ని చోట్ల సీన్స్ ని లేపలేక బోర్లా పడ్డాడు. యువ‌న్ శంక‌ర్ రాజా పాట‌లు ఉన్నాయంటే ఉన్నాయి..లేవు అంటే లేవు. సినిమాటోగ్రఫీ యావరేజ్. ఎడిటర్ …రన్ టైమ్ తగ్గించి ఉంటే ఖచ్చితంగా మంచి ఉపకారం చేసినట్లు అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటులు …. విశాల్ ఎబ్బెట్టు లేకుండా ఓ పిల్లాడి తండ్రిగా సెట్ అయ్యారు. ఆయ‌న‌కు జోడీగా సునైన న‌టించింది.ఫెరఫెక్ట్ పెయిర్. సాధార‌ణ కానిస్టేబుల్ పాత్ర‌లో విశాల్ చాలా సహజంగా చేసారు. ప్రభు, తలైవాసన్ విజయ్ రెండు మూడు సీన్స్ అయినా గుర్తుండిపోయేలా బాగా చేసారు. శూర, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ ఫరవాలేదనిపిస్తారు.మొత్తానికైతే సినిమా చూసే ప్రేక్ష‌కుడి అభిరుచి మేర‌కు ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement