Monday, May 6, 2024

Anganwadis – ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ కాన్ ఇంటిని బుధవారం అంగన్వాడీలు ముట్టడించారు.. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలలో మంత్రివర్గ బృందం అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా సమ్మె లో ఉన్న అంగన్వాడీలకు పుండు మీద కారం చల్లినట్లు బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చాలా ఉదాoసీనంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ వైఖరితో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలలో ఆగ్రహా జ్వాల రగిలింది. అంగన్వాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు ఇచ్చింది అందులో భాగంగా అంగన్వాడీలు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు తమ కోర్కెలు పరిష్కరించకపోతే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు ఎమ్మెల్యే ఇంటి ఆవరణ అంతా నినాదలతో మారు మోగింది .

ఎమ్మెల్యే ఇంటి బయటకు వచ్చి అంగన్వాడీలను శాంతింప చేయడానికి ప్రయత్నించగా అంగన్వాడీ టీచర్లు వేసిన ప్రశ్నలకు ఎమ్మెల్యే జవాబు ఇవ్వలేక పోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తను గత నెల క్రితమే అంగన్వాడీల సమస్యల గురించి వారి ఇక్కట్ల గురించి తెలుసుకున్నామని తెలిపారు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని తెలిసి చాలా చాలా బాధకు గురయ్యానని తెలిపారు ప్రభుత్వానికి కూడా నివేదిక పంపానని తెలిపారు కరోనా వల్ల ప్రభుత్వ ఖజానా ఆదాయం పడిపోయిందని సానుకూలంగా అంగన్వాడీ సోదరీమణులు ఆలోచించా లని ఎమ్మెల్యే చెప్ప గా అంగన్వాడీలు తీవ్రంగా ప్రతిస్పందించారు బైజుస్ ట్యాబులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న జగన్ . గెస్ట్ హౌస్ కోసం 450 కోట్లు ఖర్చు చేసిన జగన్ అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బుల్లేవనడం సిగ్గు చేటు అని అంగన్వాడీలు ఎమ్మెల్యే ని ప్రశ్నించారు ఎమ్మెల్యే అంగన్వాడీల ప్రశ్నల పరంపర కు సహనం కోల్పోయి ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూల మైన పురోగతి వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్మల ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప మాట్లాడుతూ వైయస్సార్ మంత్రులు అంగన్వాడీలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం చేస్తున్న ఆగడాలని అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే మంత్రులను ఎమ్మెల్యేలను రోడ్లమీద తిరగనియ్యమని జేఏసీ నాయ కురాలు పి నిర్మల ఏఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప యస్ మహమ్మద్ రఫీ కె రామకృష్ణ ఏఐటీయూసీ నాయకులు వెంకటేష్ చంద్రశేఖర్ హెచ్చరించారు.
సమ్మె శిబిరానికి ఎల్ఐసి నాయకులు సునయ్ కుమార్ పోస్టల్ నాయకులు శమంతకమణి రెడ్డి బిఎస్ఎన్ఎల్ గౌరవాధ్యక్షులు భాస్కర్ రెడ్డి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం వెంటనే విరమింపజేసి న్యాయమైన కోర్కె లు తీర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి నాయకురాలు బి రేణుక పుష్ప ఏఐటిసి అనుబంధం అంగన్వాడీలు నాయకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement