Saturday, May 11, 2024

Sirikonda – రైతు బందు ఉసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత

.సిరికొండ, డిసెంబర్ 27 ( ప్రభ న్యూస్ ): కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే పంట పెట్టుబడి సహాయం క్రింద రైతుల ఖాతాల్లో రూ.15 వెయ్యిలు జమ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 20 రోజులు కావస్తున్నా రైతు బంధు నిధుల గురించి ఉసెత్తడం లేదని నిజామాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలంలో బుధవారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్బంగా ఎమ్మెల్సీ కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు. రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయడానికి బిఆర్ఎస్ సిద్ధమైన తరుణంలో నిలిపివేయించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 20 రోజులు కావస్తుంది. కాని రైతు బంధు ఉసెత్తడం లేదని కవిత విమర్శించారు.

నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిన అనంతరం. ఆరు గ్యారంటీల పథకాలను వర్తింప చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శాసన సభకు నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు. ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింప చేయాలని యోచిస్తున్నందున. రేషన్ కార్డు లేని లబ్దిదారులు తీవ్రంగా నష్టపోతారు. అందు వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని కవిత సూచించారు.

నిజామాబాదు జిల్లా ప్రజలు జనవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు వచ్చిన వారు విద్యుత్ బిల్లులు చెల్లించ వద్దని కవిత సూచించారు.ఈ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రజలకు పత్రిక ముఖంగా తెలిపారు.

కవిత వెంట సిరికొండ జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, ఎంపీపీ అధ్యక్షుడు సంగీత రాజేందర్, నిజామాబాదు రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిరికొండ సర్పంచ్ రాజరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌస్ బాషా, మండల సర్పంచుల ఫోరం చేర్మెన్ రమేష్,కొండూర్ సర్పంచ్ నర్సరెడ్డి, జాగృతి మండల కన్వీనర్ జయనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అన్ని మతాలను కేసీఆర్ ప్రభుత్వం గౌరవించింది – ఎమ్మెల్సీ కవిత

సిరికొండ, : తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలను గౌరవించి సముచిత స్థానాన్ని కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని నిజామాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కవిత క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడుతు.బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సముచిత స్థానాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అందులో భాగంగా పడపడుచుల కోసం బతుకమ్మ పండుగకు చీరల పంపిణి, రంజాన్లో పేద ముస్లింలకు నూతన వస్త్రాలు, క్రిస్టియన్లకు, క్రొత్త బట్టలను బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంగతిని కవిత గుర్తు చేశారు.నా చదువు స్థాన్లి వుడ్ పాఠశాలలో కొనసాగిన సమయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించే వాల్లం. నర్సింగ్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటే ఆనాటి గుర్తులను నెమరవేసుకున్నారు

.ఏ మతంలో చుసిన ఇతరులకు తోచిన సహాయం చేయమని ప్రభోదిస్తున్నాయి. అందు వల్ల మనం మన జీవితంలో ఇతరులకు తోచిన సహాయం చేయాలని కవిత కోరారు.తెలుగు రాష్ట్రాలలో అన్ని మతాల పండుగలను గౌరవించింది ఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. మతాలు వెరైన మనమందరం భారతీయులం అనే భావంతో కలసి మెలసి ఉండాలని ప్రజలను కవిత కోరారు.

అంతకు ముందు సిరికొండ మండల పర్యటనకు విచ్చేసిన సందర్బంగా. నిజామాబాదు రూరల్ కన్వీనర్ సాయిచరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితకు జాగృతి కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, ఎంపీపీ అధ్యక్షుడు సంగీత రాజేందర్, మాజీ ఎంపీపీ మంజుల, జిల్లా రైతు బంధు మాజీ కోఆర్డినేటర్ మంజుల, సిరికొండ సొసైటీ ఉపాధ్యక్షుడు పిలిప్, మాజీ జడ్పీటీసీ అయిత సుజ, మైలారం ఎంపీటీసీ సతీష్,నర్సింగ్ పల్లి, సిరికొండ, కొండాపూర్, న్యావనంది, కొండూర్, పెద్దవాల్గొట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement