Thursday, May 9, 2024

NTR: పాఠశాలలో కుంభ వృష్టి.. గొడుగు నీడలో పాఠాలు..

(విస్సన్నపేట ప్రభ న్యూస్) : ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాల చిన్నపాటి వర్షానికి తడిసి ముద్దయింది. ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా స్కూల్ లో వర్షాల వల్ల 6ఏ, 6బి, స్కూల్ క్లాస్ రూమ్స్ నీట మునిగాయి. నాడు – నేడు ద్వారా సుమారు 66 లక్షల రూపాయల పనులు చేసినప్పటికీ అభివృద్ధి అనేది శూన్యంగా పగిలిన రేకులు క్రింద వర్షపు నీటిలో కూర్చున్న విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.


క్లాస్ రూమ్ లో రేకులు పగిలిపోయి వర్షపు నీరు పడుతున్నా గొడుగులు వేసుకొని కూర్చున్న విద్యార్డులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వర్షపు నీటిలో పాములు, జర్రులు వస్తున్నాయని విద్యార్థులు భయపడ్డారు. నీటిలో మునిగిన క్లాసులకు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. స్కూల్ రూమ్ లోకి వర్షపు నీరు రావడంతో నీటిని బయటకు చిమ్ముతున్న విద్యార్థులు వారి తరగతి గదులను వారే శుభ్రపరచుకోవడం కనిపించింది. చిన్నపాటి వర్షం పడినా కూడా పాఠశాల నీట మునిగి చెరువులా తలపిస్తుందని విద్యార్థులు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement