Wednesday, May 1, 2024

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్పు

150 కోవిడ్ పడకలు 250కి పెంపునకు టాస్క్ ఫోర్స్ సమావేశంలో నిర్ణయం
కోవిడ్ వ్యాక్సినేషన్ విభాగం లేడియాంపిల్ కళాశాలకు మార్పు

మచిలీపట్నం – రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమావేశపు హాలులో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలు, ఆసుపత్రిలో సౌకర్యాల పెంపు వంటి పలు అంశాలపై రెవిన్యూ, పోలీసు, వైద్య, మున్సిపల్ అధికారులతో చర్చించారు. కోవిడ్ సెకండ్ వేవ్ రోజురోజుకు విస్తరిస్తున్నందున కోవిడ్ భారిన పడేవారి సంఖ్య అధికమవుతున్నందున మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చి ప్రస్తుతం ఉన్న 150 కోవిడ్ పడకలను 250కి పెంపునకు సమావేశంలోని ర్ణయం తీసుకుని రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సిబ్బంది. వైద్య పరికరాలు తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్ పడకలు పెంచుతున్నందున కోవిడ్ విభాగానికి వేరే ప్రవేశంద్వారా ఏర్పాటు చేయాలని, ఎడ్మిట్ అయిన కోవిడ్ రోగులు బయట తిరగకుండా వారికి ట్యాగ్లు వేయాలని సూచించారు. కోవిడ్ విభాగంలోనికి ఎవరు పడితే వారు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చురి విభాగంలో అవసరమైన మార్చురి బాక్స్లు అదనంగా ఏర్పాటు చేయాలని, అవసరమైతే దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామని మంత్రి. అన్నారు. స్కానింగ్ కు, ఆపరేషన్సకు అవసరమైన రేడియాలజిస్ట్, మత్తు డాక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్య పెంచుటకు అవసరమైతే డిప్యూటేషన్పై తీసుకురావాలన్నారు.ఆసుపత్రి ఎదుట గల ఆశీర్వాద భవన్లో ట్రైయేజ్ సెంటర్ ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించుటకు అవసరమైన మెటీరియల్, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ విభాగంలో బాత్రూమ్స్ డోర్స్ మరమ్మత్తులు చేయించాలని మంత్రి ఆదేశించారు. బెల్ కంపెనీ ఆసుపత్రికి ఇచ్చిన వెంటిలేటర్లు చెక్క్ చేసి వినియోగంలోనికి తేవాలన్నారు. బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ సిద్ధం చేసుకోవాలన్నారు.అనంతరం బందరు ఆర్డీవో ఎన్ఎస్.కె. ఖాజావలి మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చుటకు నిర్ణయం తీసుకున్నందున, వైద్యులు, సిబ్బందిని కోవిడ్ ట్రీట్మెంటు కేటాయించినందున, గైనిక్, పిడియాట్రీషియన్ విభాగంలో సాధారణ చికిత్సలు మాత్రమే నిర్వహిస్తారని, ప్రజలు ఈ విషయం గమనించాలని అన్నారు. నాన్కోవిడ్ సాధారణ రోగులు దగ్గరలో ఉన్న గూడూరు, చిన్నాపురం, తాళ్లపాలెం పిహెచ్సీలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రిగా మార్చినందున కోవిడ్ వ్యాక్సినేషన్ విభాగం దగ్గరలోనే లేడియాంపిల్ కళాశాలలోనికి మార్చడం జరిగిందని ఆర్థివో తెలిపారు. లేడియాంపిల్ వద్ద ఆశీర్వాదభవన్ వద్ద ఎల్లపుడు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు..మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్. శివరామకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ తీవ్రత దృష్ట్యా కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా కోర్టు సెంటర్ వద్దగల రైతుబజార్, రెగ్యులర్ చేపల బజారు మూసివేస్తున్నట్లు, వీటికి ప్రత్నాయ్యంగా పట్టణంలో మార్కెట్ యార్డులో, జడ్పీ వద్ద సిమ్మింగ్ పూల్ వద్ద, పంచాయితీరాజ్ కాలనీ వద్ద, జైహింద్ స్కూల్ వద్ద కూరగాయలు విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, చేపల విక్రయాలకు సర్కారుతోట షాపింగ్ కాంప్లెక్స్ వద్ద, బాస్కరపురంలో ఓపెన్ స్పెస్లో పౌట్స్ గ్రౌండ్ వద్ద, జైహింద్ స్కూల్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆర్ఎంపి వైద్యులు కోవిడ్ చికిత్స చేయకూడదని, మాస్క్ లు ధరించాలని కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయుటకు విజిలెన్సు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. డిఎస్పి ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజులుగా కోవిడ్ టాస్క్ఫోర్స్ సమావేశాలు: నిర్వహించి కోవిడ్ కట్టడిక్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మెడికల్ తప్ప అన్ని రకాల షాపులు రాత్రి 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసి ఉంచాలి. ఇది కర్ఫ్యూ కాదని, కఠిన ఆంక్షలు అమలు మాత్రమే ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మాధవి, తహసిల్దారు డి. సునీల్ బాబు, ట్రాఫిక్ డిఎప్పి మాసం బాషా, డా. అల్లాడ శ్రీనివాసరావు, డా. మల్లిఖార్జునరావు, డా. జయకుమార్, టిపిఎస్ నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement