Friday, April 26, 2024

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ల‌లో ప్రత్యేక రైళ్లు!

విజయవాడ నుంచి మహబూబ్‌నగర్ మ‌ధ్య ప్ర‌త్యేక రైల్ల‌ను న‌డిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబరు 08585/08586 విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌ వరకు డిసెంబర్‌ 6 నుంచి 28వ తేదీవరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో అదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఈ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement