Sunday, April 28, 2024

Kakinada – ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న బైక్ … ముగ్గురు స్పాట్ డెడ్ ..

కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్‌ సెంటర్‌ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement