Saturday, May 4, 2024

Congress VijayaBheri – కేసీఆర్​ వన్నీ అబద్ధాలే.. దొర‌పాల‌న‌లో బడి లేదు.. గుడిలేదు.. విరుచుకు ప‌డ్డ రేవంత్ రెడ్డి

దౌల‌తా బాద్ – బంగారు తెలంగాణ చేస్తనని కేసీఆర్ చెప్పిండు, ఒక్క తులం బంగారం ఇచ్చిండా? కొడుక్కి , అల్లుడికి మంత్రి పదవి ఇచ్చిండు, అంతే గానీ తాగటానికి నీరు ఇచ్చిండా? పిల్లలకు మంచి చదువు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ నమ్మించిండు, కానీ చెప్పింది వేరు, చేసింది వేరు, అందుకే ఒక్కసారి ఆలోచించండి అని దౌలతాబాద్ ప్రజలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. దౌలతాబాద్లో కాంగ్రెస్ పార్టీ జయభేరీ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలో తాను వేసిన డబుల్ రోడ్డు తప్ప మరో రోడ్డు నిర్మించలేదన్నారు. చదువుకుని పిల్లలకు తానే బడి నిర్మించానని వివరించారు. వికారాబాద్ రైలు మార్గం నిర్మిస్తానని, కొండగల్లో సిమెంటు ఫ్యాక్టరీ తీసుకు వస్తానని, దౌలత్బాద్లో జూనియర్ కాలేజీని తీసుకువస్తానని, కొండగల్లో ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తానని కేసీఆర్ వాగ్దానాలు కుమ్మరించారని, వీటిల్లో ఒక్కటన్నా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఉచిత చదువులు ఏవీ?
పిల్లలకు ఉన్నత చదువుల అవకాశం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. రైతులకు సాగు నీరు లేదు. కనీసం ఉచిత కరెంటూ లేదు. ఇంకా ఎంతకాలం నమ్మాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఇసుక రవాణా దందా, కమిషన్ల వసూళ్లే ఎకుకవయ్యయాని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం నిత్వవసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కొంగులో పైసలతో సంతకు పోతే సంచి నిండా సరుకులు తెచ్చేవాళ్లమని, ఇప్పుడు సంచిలో రూపాయలు తీసుకువెళ్తే కొంగులో కూరగాయలు తెస్తున్నామని రేవంత్రెడ్డి అన్నారు. మంచినూనె రెండొందలు, పప్పు రెండొందలకు పెరిగిందన్నారు. గ్యాస్ ధర విపరీతంగా పెరిగిందన్నారు.

బెల్టు షాపుల‌తో ఆగ‌మైతున్న‌రు..
కూలీ నాలీ పని చేసి.. సాయంత్రానికి చేతిలో డబ్బులొస్తే.. బెల్టు షాపుల్లో గుటకేస్తుంటే, ఇంటి ఇల్లాళ్లు సంసారం నడపటానికి నానా అవస్థలు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ ఏమో కానీ,, మహిళలకు కనీసం తులం బంగారం ఇవ్వలేక పోయాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ పథకంలో ఆడబిడ్డ పెళ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఆలోచించండి, కేసీఆర్ హామీలు నెరవేరవు, రెండు సార్లు సీఎం చేశాం, మూడో సారి సీఎం పదవి కోసం మీ ముందుకు వచ్చి హామీలు ఇస్తుండు. కానీ కాంగ్రెస్ పాలనలోనే పేదల బతుకు మారతాయని రేవెంత్ రెడ్డి వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement