Saturday, May 18, 2024

ప్రజలకు అందుబాటులో వై యస్ ఆర్ కంటి వెలుగు

చెన్నూరు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అందత్వ నివారణ లో బాగo గా నేటి నుంచి జులై 15 తేదీ వరకు చెన్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని సచివాలయంలో వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 60 సం. పై బడిన వారికి కంటికి సంబంధించిన వ్యాధులు /సమస్యలు(కండ్లకలక, కంటి శుక్లం లు, నీటి కాసులు, మెల్లకన్ను, డయాబిటిక్ రెటీనో పతి, విటమిన్ ఏ లోపాలు) గుర్తించి వారికి చికిత్స అందించనున్నారు. అవసరమైతే వారికి శుక్లం ఆపరేషన్లు, ఉచిత కంటి అద్దాలు, అందచేస్తామని వైద్యాధికారులు అన్నారు. చెన్నూరు మండల పరిధిలో సుమారు 850 మంది 60 సం, పై బడిన వారికి రోజు కు 25 మంది చొప్పున కంటి పరీక్షలు నిర్వ హిస్తారు. ఈ కంటి పరీక్షల కార్యక్రమంలో కరుణాకర్ నేత్ర వైద్యా సహాయకుడు, డా. చెన్నారెడ్డి ,ఆరోగ్య విద్యా బోధకుడు జయ రాముడు మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement