Sunday, May 19, 2024

అడవికి నిప్పు – వన్యప్రాణుల ఆర్త నాదాలు

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో వన్యప్రాణులకు మంచి నీరు, ఆహారం..

మైదుకూరు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఆవిరైపోతున్నాయి. దప్పిక తీర్చుకునేందుకు వన్యప్రాణులు జనావాసాల వైపు వస్తున్నాయి. ఫలితంగా వేటగాళ్ల ముప్పుపెరుగుతోంది. ప్రస్తుతం వేసవి తీవ్రత అధికమవుతోంది. దాంతో జంతువులకు ఆహారం, తాగునీటి లభ్యత కూడా గగనమై పోతోంది. ఈ వేసవిలో కుంటల్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది. రకరకాల పక్షులు, అడవి కోళ్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా నేస్తం సేవా సంస్థ సభ్యులు కడప జిల్లా, మైదుకూరు – పోరుమామిళ్ల నల్లమల అభయారణ్యంలో నందు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో మంచి నీరు త్రాగడానికి వీలుగా తొట్ల, పక్షులు నీరు త్రాగడానికి వీలుగా కుండీలు, బేసులు, సుంకులను ఎర్పాటు చేసి వాటి నిండ మంచి నీటిని నింపి.. అరటి, జామ, టమోట పండ్లును వన్యప్రాణులకు ఆహారంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యుడు వి. ఉపేంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆకలి, దప్పికలతో అలమటిస్తున్న వన్యప్రాణులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అడవిలో తొట్లను, కుండీలను ఎర్పాటు చేపి వాటికి మంచి నీటిని నింపుతున్నాం. వన్యప్రాణులు నీటిని తాగుతూ ప్రాణాలు దక్కించుకుంటున్నాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు వన్యప్రాణులను వేసవి ప్రమాదం నుంచి రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందర్భంగా మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యుడు పి. బాలనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అడవికి నిప్పు మానవాళి మనుగడకే ముప్పుగా మారుతుందని తెలిసినప్పటికీ కొందరు ఆకతాయిలు అడవికి నిప్పు పెడుతూనే ఉన్నారు. మైదుకూరు – పోరుమామిళ్ల రోడ్డులో ఉన్న కొండలు రెండు వారాలుగా మంటలు మండుతునే ఉన్నవి. అడవికి నిప్పు పెట్టడంవల్ల విలువైన కలప మొక్కలతో పాటు అడవుల్లో ఉన్న పశు పక్ష్యాదులు, జంతువులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలను అటవీశాఖ అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలన్నారు.ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు కె.కొండారెడ్డి, వి. ఉపేంద్రకుమార్, పి. నియాజ్, పి. బాలనాగిరెడ్డి, వెంకటరెడ్డి, సురేంద్రకుమార్, డి.హరి, వెంకటేష్, పుల్లయ్య, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement