Thursday, May 16, 2024

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. ఇద్ద‌రు దొంగ‌ల అరెస్ట్ : ఎస్పీ అన్బురాజన్

కడప క్రైమ్ : కడప నగరం చిన్న చౌక్ ప్రాంతంలోని తాళాలు వేసిన గృహా లే ఆదొంగలు టార్గెట్.. ద్విచక్ర వాహనం లో రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇంటిని గుర్తించడం తర్వాత అత్యాధునిక పరికరాలతో కిటికీ కట్ చేసి ఇళ్లలోకి చొరబడిడటం వారికి వెన్నతో పెట్టిన విద్య ఇలాంటి కరడుగట్టిన దొంగలను కడప చిన్న చౌక్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి అరెస్ట్ చేసి శభాష్ అనిపించుకున్నారు, వివరాల్లోకి వెళితే… చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, ఏడు కేజీల వెండి వస్తువులు నేరానికి ఉపయోగించిన ఒక హైడ్రాలిక్ కట్టర్, ఒక మామూలు కట్టర్ తో పాటు నేరానికి ఉపయోగించిన ఒక హోండా డియో స్కూటీ ని స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు, సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప డిఎస్పి వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలోని టీం చిన్న చౌక్ ఇన్ స్పెక్ట‌ర్ అశోక్ రెడ్డి తన బృందంతో కలిసి చిన్న చౌక్ బైపాస్ రోడ్డులో ఈదర దొంగలనుఅరెస్ట్ చేసినట్లు తెలిపారు,

కడప గంజి కుంట కాలనీకి చెందిన పటాన్ అజ్మతుల్లా ఖాన్, కడప శంకరాపురం చెందిన వెంకటేష్ ఇద్దరు కలిసి జల్సాగా తిరుగుతూ ఉండేవారు అని తెలిపారు. సాయంత్రం వేళలో ద్విచక్ర వాహనం లో తాళం వేసిన గృహాలను గుర్తించి చుట్టుపక్కల రెక్కీ నిర్వహిస్తారు అదే రోజు ఇరువురు దొంగతనానికి వెళ్లి ఇంట్లో విలువైన వస్తువులు దొంగలు ఇస్తారని తెలిపారు. వీరిరువురు ఈ మధ్య కాలంలోనే ఎనిమిది ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు నగలు 7 కేజీల వెండి వస్తువులు చోరీకి ఉపయోగించిన ఒక హైడ్రాలిక్ కట్టర్ మరొకటి కట్టర్ స్వాధీనం చేసుకొని ఈ మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు, దొంగలను అరెస్టు చేయడంలో మంచి ప్రతిభ కనబర్చిన ఇన్ స్పెక్ట‌ర్ అశోక్ రెడ్డి ఎస్ఐలు అమర్నాథ్ రెడ్డి, రోషన్ లను ఎస్పి ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు అందజేశారు, చోరీలకు పాల్పడిన ఇరువురి పై పి.డి యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement