Wednesday, May 8, 2024

కడప యువకుడు కువైట్ జైలులో ఆత్మహత్య

కువైట్ సెంట్రల్ జైలులో కడప జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌డ‌ప జిల్లాకు చెందిన‌ ఉనన వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. వెంకటేష్ కొన్నాళ్ల క్రితం కువైట్ కు వెళ్లారు. అయితే వెంకటేష్ ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు కఠిన శిక్ష వేసే అవకాశముందని ప్రచారం జరిగింది. దీంతో కువైట్ జైలులో ఉన్న వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప జిల్లా లకల్కిరెడ్డి పల్లికి చెందిన వెంకటేష్ కువైట్ లో తాను పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్య‌ చేశారు. డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్ ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఈ నెల 7వ తేదీన వెంకటేష్ ను కువైట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. హత్య కేసులో తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతో వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ వెంకటేష్ కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.


కువైట్ పోలీసులు కథనం మేరకు.. ఆర్దియా పట్టణంలోని సేఠ్ అహ్మద్ (80) వద్ద పిల్లోళ్ల వెంకటేశ్ పనికి కుదిరాడు. ఆయన వద్ద డ్రైవర్ పనికి చేరిన అతను.. ఇటీవల వ్యాపారితో పాటు ఆయన భార్య కాల్దా (62), కుమార్తె అసుమ (18)ను హతమార్చాడు. ఇంట్లో దొంగతనం చేయబోతే అడ్డుకోగా.. అందుకే చంపాడని కువైట్ పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement