Friday, December 6, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ నిరసన

రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా కడప నగరంలోని 12వ డివిజన్ రెడ్డి కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇంటింటికీ క్యాండిల్, విసనకర్రలు అందిస్తూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిలు హరి ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, నగర అధ్యక్షుడు శివ కొండా రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement