Thursday, May 2, 2024

ఏపీ యువతకు జర్మనీలో ఉద్యోగాలు.. 12 మందికి వీసా ప్రక్రియ పూర్తి

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తాజాగా జర్మనీలో పనిచేసేందుకు 150 మంది అర్హులైన బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కోసం విడుదల చేసిన ప్రకటనకు విశేష స్పందన లభించింది. నాలుగు దశల్లో పూర్తికానున్న ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం శ్రీకారం చుడుతోంది.

గుంటూరు జిల్లా కేఎల్‌ యూనివర్సిటీ- వేదికగా ఏ1, ఏ2 బి1 లెవల్‌ వరకు అభ్యర్థులకు జర్మనీ భాష లో శిక్షణ ఇవ్వనున్నారు. జర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఎంపి-కై-న అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుండి టక్ట్‌ ఇంటర్నేషనల్‌, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్‌ భాషలో రెండు నెలల పాటు- శిక్షణనిచ్చి అనంతరం వీసా ప్రక్రియ పూర్తి చేయనుంది.

అంతర్జాతీయ నియామకాలు సులభతరం
స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నియామకాలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకోసం ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీ, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పా-టైన రిజిస్టర్‌ రిక్రూట్‌ ఏజెన్సీ తదితర సంస్థల సహకారంతో అవసరమైన మానవవనరులను అందించేందుకు రాష్ట్రం తరపున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

- Advertisement -

గత నెలలో 12 మంది బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను టక్ట్‌ ఇంటర్నేషనల్‌ మరియు ఆక్సిలా అకాడమీ బృందం విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు- వారి వీసా ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే వారు జర్మనీలో నర్సులుగా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు- ఆ బృందంలోని సభ్యులు తెలిపారు. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనికి సంబంధించి టాక్ట్‌ ఇంటర్నేషనల్‌, ఏపీఎన్‌ఆర్టీఎస్‌ తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2 నెలల పాటు రోజుకు 6 గంటల చొప్పున వారానికి 48 గంటలు శిక్షణ ఉంటు-ంది.

శిక్షణ సమయంలో హాస్టల్‌ లో ఉండే అభ్యర్థులు హాస్టల్‌ ఫీజులను వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి తన బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు-, పాస్‌ పోర్ట్‌, అనుభవ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆఫర్‌ లెటర్‌ పొందిన అభ్యర్థులకు విమాన ఛార్జీలు ఉచితం. మొదటి 6 నెలలు ఆహారం, వసతి కూడా ఉచితంగా అందించనున్నారు. ఈ సమయంలో నెలకు 1,000 యూరోలు (రూ.89వేలు) జీతం కూడా ఇవ్వనున్నట్లు- నైపుణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఏపీఎస్‌ఎస్డీసీ వెబ్‌ సైట్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాలని, నైపుణ్యాభివృద్ధి సంస్థ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 99888 53335 సంప్రదించాల్సిందిగా సూచించారు.

ప్రాధాన్యతా రంగాల్లోనూ ఛాన్స్‌
హెల్త్‌ కేర్‌ (నర్సింగ్‌) కు సంబంధించిన ఉద్యోగాలే కాకుండా ఐటీ-, హాస్పిటాలిటీ-, ప్లాస్టిక్‌, ఇతర ప్రాధాన్యత రంగాల్లోనూ అవకాశాలను కల్పిస్తున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌ కుమార్‌ వెల్లడించారు. జర్మనీలో 6 నెలలు బీ2 సర్టిఫికేషన్‌ శిక్షణ ఇస్తారని, బీ2 స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన తరువాత నెలకు 2,500 యూరోలు (రూ.2.20 లక్షలు) జీతం కూడా ఇచ్చే అవకాశం ఉంటు-ందని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement