Saturday, April 27, 2024

AP | జనసైన్యం ఫుల్​ జోష్​.. మరో 11 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్​

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఏపీలోప్రతి పక్ష త్రికూటమి సీట్ల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో.. జన సేన అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు అనధికారికంగా ఖరారు కాగా… ఇక జనసేన అధినేత పనన్ కళ్యాణ్ ప్రకటనే ఆలస్యం. ఇప్పటికే టిక్కెట్లు ఖరారైన సమాచారంతో అభ్యర్థులు తమ ఇలాఖాల్లో తమ కార్యాచరణ ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య సీట్ల ఎంపిక పూర్తి కావొచ్చింది. టీడీపీ ఐదారు మినహా అన్నింటినీ ప్రకటించింది. ఇప్పుడు జనసేన వంతైంది. ఇప్పటివరకు కేవలం ఏడు సీట్లను మాత్రమే ప్రకటించింది. మిగతా సీట్లను పెండింగ్‌లో పెట్టింది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో పార్టీ అధినేత అంతర్గత మంతనాలు సాగించారు.

11 మంది అభ్యర్థుల ఎంపిక..

తాజాగా 11 స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను పిలిపించి పవన్కళ్యాణ్ విధివిధానాలను స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారంలోకి దిగాలని పవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్‌బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణయాదవ్ ఉన్నారు. తూర్పుగోదావరిరాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ దాదాపు సీట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.ఇక పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి చిర్రి బాలరాజు, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నర్సాపురం బొమ్మడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, తాడేపల్లి‌గూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌లకు దాదాపుగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తిరుపతిలో బుజ్జగింపులు..

తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు దాదాపు ఖాయమైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సీటు విషయమై తిరుపతి జనసేన నేతలను పిలిచి నాగబాబు మాట్లాడారు. ఇక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్‌రాయల్, టీడీపీ నుంచి సుగుణమ్మతోపాటు మరో ఇద్దరు నేతలు టికెట్‌ను ఆశిస్తున్నారు.మరో మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్నది తేలాలి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ, కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాలి.

- Advertisement -

తుది దశలో బీజేపీ కసరత్తు

ఏపీలో సీట్ల కసరత్తును బీజేపీ హైకమాండ్ ముమ్మరం చేసింది. ఆలస్యమైన కొద్దీ ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. దీనికితోడు సమయం దగ్గరపడుతుండడంతో అటువైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. పెండింగ్‌లోని స్థానాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో మంతనాలు సాగించినట్టు సమాచారం. ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది.

ఎవరెవరు ఎక్కడైతే బాగుంటుందని నేతలతోపాటు సర్వేల ఆధారంగా ఎంపిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వీటిలో అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి, కడప, ఒంగోలు, అనంతపురం ఉన్నాయి. వీటిలో ఆరు నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేయనుంది. మిగతా నాలుగింటిలో టీడీపీ బరిలోకి దిగనుంది. ఇక టీడీపీ ఇప్పటికే 13 సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం సీటును దాదాపు బాలశౌరికి జనసేన ఓకే చెప్పినట్టు సమాచారం. కాకినాడ సీటును మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇందులో నాగబాబు దిగుతారా? లేక ఉదయ్ దిగుతారా? అన్నది సస్పెన్స్ గా మారింది.

బెజవాడ పశ్చిమలో సుజనా చౌదరి..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సృజనా చౌదరి పేరును ఖరారు చేసినట్టు ఇక్కడి రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. ఆర్ఎస్ఎస్ క్రియాశీలుడిగా వీహెచ్ పీ నేత శ్రీరామ్ పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుండగా తెలుగుదేశం పార్టీని వీడిప్పటికీ బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యుడు సృజనా చౌదరి విజయవాడ పశ్చిమ టిక్కెట్టు ఆశిస్తున్న విషయం తెరమీదకు వచ్చింది.

ఇందులో భాగంగా బీజేపీ కూడా సముఖతగా వ్యక్తం చేస్తోంది. .టీడీపీ అధికారంలోకి వస్తే పొత్తులో భాగంగా బీజేపీకి రాష్ట్ర మంత్రి వస్తుంది, ఈ స్థితిలో ఎన్టీఆర్ జిల్లా నుంచి సృజనా చౌదరి కి అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నారు.. తెలుగుదేశం పార్టీలోని బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా సృజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు.. జలీల్ ఖాన్విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీటును కోరేందుకు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కాంగ్రెస్లో చేరుతున్నారు. ముస్లింల కోటలో బలమైన అభ్యర్థిగా సుజనాచౌదరిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి జలీల్ ఖాన్, వైసీపీ నుంచి ఆసిఫ్ పేర్లు అభ్యర్థులగా దాదాపు ఖరారు అయినట్లేని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement