Thursday, April 25, 2024

GT vs MI | కొత్త కెప్టెన్ల‌తో బ‌రిలోకి ముంబై, గుజ‌రాత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17 వ సీజ‌న్ డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్, గుజ‌రాత్ టైటన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై న‌యా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ మరి కొద్ది సేప‌ట్లో ప్రారంభం కానుంది.

కాగా, ఈ రెండు జట్లూ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అదే జట్టుకు మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబైకి నాయకత్వం వహించనున్నాడు.

జట్ల వివరాలు..

ముంబై ఇండియన్స్ :

ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్

గుజరాత్ టైటాన్స్ :

- Advertisement -

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్

Advertisement

తాజా వార్తలు

Advertisement