Saturday, April 27, 2024

ఎంఓయూలు @ 100 డేస్..

అమరావతి, ఆంధ్రప్రభ : విశాఖ పెట్టుబడుల సదస్సు తాలూకు ముఖ్యమంత్రి వీలైనంత త్వరలో కార్యరూపం లోకి తీసుకొచ్చేలా ఎంఓయూలను యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటు న్నారు. ఆమేరకు ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోం ది. దీనికంటే ముందుగా, అసలు ఈ సదస్సులో జరిగిన ఒప్పందాలపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. వాటిని రెండు రకాలుగా విభజించి చిన్న చిన్న పెట్టుబడులకు సంబంధించి వెంటనే కార్యరూపంలోకి వచ్చేలా చేయాలం టే ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ సిద్ధం చేసుకుంటు న్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సేకరించిన సమాచారం మేరకు ఈనెల 10వ తేదీ నుండి 100 రోజుల సమయంలో చిన్న చిన్న ఎంవోయూలన్నీ కార్యరూపంలోకి వచ్చేలా చూడాలని ఆయన ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై ఆయన విధి విధానాలను రూపొందించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోం ది. అందులో భాగంగా అధికారుతో సమన్వయం చేసుకునే లా ఒక పొలిటికల్‌ కమిటీ కూడా ఏర్పాటు కాబోతున్నట్లు సమాచారం.

కంపెనీల యాజమా న్యాల అవసరాలను ఈ కమిటీలు తెలుసుకుని సీఎస్‌ స్థాయిలో చేయగలిగినవి చేస్తూ సీఎం స్థాయికి తగిన అంశాలను వెంటనే సీఎం దగ్గరకు తీసుకెళ్లేలా ఈ రెండు కమిటీలు పనిచేయనున్నట్లు తెలుస్తోం ది. అటు పొలిటికల్‌ కమిటీ, ఇటు సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ సమన్వయంతో ముందకు వెళ్లేలా విధివిధానాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీల యాజమా న్యాలతో నిత్యం మాట్లాడటం, ప్రభుత్వపరంగా వారికి అందాల్సి న సహాయ సహకారాలు సకాలంలో అందేలా చూడటం ఈ కమిటీల బాధ్యతగా ఉండనుంది. ఇందుకోసం ఎప్పుడు ఏ కంపెనీతో ఏ విషయంపై మాట్లాడింది..ఆసమయంలో ఆయా కంపెనీలు ఏమేమి అడిగాయి..అన్న అంశాలను పేపర్‌ మీదపెట్టి సాధ్యాసాధ్యాలపై ఈ రెండు కమిటీలు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నాయి. ఈ చర్చల్లో కంపెనీలు అడిగిన అంశాలు సీఎస్‌ స్థాయిలో పరిశీలించి పరిష్కరించగలిగితే వెంటనే దానిని పూర్తి చేయడం, లేనిపక్షంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యి వాటిని కంపెనీలు నిర్దేశించుకున్న సమయానికే పూర్తి చేయడం ద్వారా కంపెనీలకు ఏపీ ప్రభుత్వం, పరిపాలన పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకురావలన్నది చిట్టచివరి అంశంగా సీఎం జగన్‌ ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ తంతు పూర్తయితే పెట్టుబడి దారుడు తమ పెట్టుబడులను వెంటనే పెట్టేందుకు నూటికి నూరు శాతం అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆమేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

100 రోజుల్లో కార్యరూపంలోకి వచ్చేలా :
ఇదిలా ఉండగా చిన్న చిన్న ఎంవోయూలకు సంబంధించి వంద రోజుల్లో గ్రౌండింగ్‌ లెవల్‌కు తీసుకురావాలన్నది సీఎం జగన్‌ సంకల్పంగా ఉంది. ఈ వంద రోజుల కాలంలోనే అటు అధికారులు, ఇటు సీఎం ఎంపికచేసిన పొలిటికల్‌ కమిటీ నిర్విరామంగా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా రంగాల్లో నిష్ణాతులు వంటి ముగ్గురు నుండి ఐదుగురు వరకూ సభ్యులను తీసుకుని ప్రతి రోజూ దీనిపై ఆయా కంపెనీలతో చర్చించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద రోజుల్లో చిన్న చిన్న కంపెనీలన్నీ కార్యరూపంలోకి తీసుకొస్తూనే పెద్ద పెద్ద ఎంవోయూలకు సంబంధించి పరస్పర సమావేశాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా పెద్ద కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపు, విద్యుత్‌ , నీరు, పర్యావరణ తదితర అనుమతులకు సంబంధించి అధికారులతో వెనువెంటనే మాట్లాడించి కంపెనీల యాజమాన్యాలకు కించిత్‌ ఇబ్బంది కూడా లేకుండా చేయాలన్నది సీఎం జగన్‌ అభిమతంగా ఉంది. ఆమేరకే నిర్ణయాలన్నీ వేగంగా జరిగిపోతున్నాయి.

సీఎస్‌కు స్పెషల్‌ టాస్క్‌ :
ఇదిలా ఉండగా, పరిపాలనలో విశేష అనుభవం గడించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని కీలక బాధ్యతలను కూడా అప్పగించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. వివిధ శాఖల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కలెక్టర్‌గా పనిచేసి విశేష అనుభవం గడించిన ఆయనకు పారిశ్రామికవేత్తలతో మెలిగే విధానం పట్ల అనుభవం ఉందని సీఎం జగన్‌ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతి వారం క్రమం తప్పకుండా కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం, వారి పెట్టుబడులు పెట్టుందుకు అవసరమైన అన్ని అనుమతలు కల్పించడం, అవసరమైతే సీఎంతో కంపెనీల ప్రతినిధులను మాట్లాడించడం వంటి కీలక అంశాల బాధ్యతను సీఎస్‌కు అప్పగించారు. ఈక్రమంలోనే అన్ని శాఖల అధికారులతోనూ ఆయన సమన్వయం చేసుకుంటూ ఎక్కడా పరిపాలనా పరమైన అంశాలు కుంటుపడకుండా సీఎస్‌ జవహర్‌ రెడ్డి తన బాధ్యతలను నిర్వహిస్తారని సీఎం జగన్‌ థృఢంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ నాయకులను కూడా ఆయన తనదైన శైలిలో కలుపుకుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎక్కడా ఈగోలకు వెళ్లకుండా, పనులు కుంటుపడకుండా అనుకున్న సమయంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా సీఎస్‌ జవహర్‌ రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు కట్టెబట్టనున్నారు.

- Advertisement -

శాఖలతో సమన్వయం
ఈ కమిటీలు సీసీఎల్‌ఏ, విద్యుత్‌, జల వనరులు, అటవీ, పర్యావరణం వంటి శాఖల అధికారులతో నిత్యం టచ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలకు సంబంధించి ఏ శాఖలో తమకు పని ఉన్నా వెంటనే ఈ కమిటీలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధమౌతోంది. మరీ ముఖ్యంగా సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక విద్యుత్‌, భూమి, నీరు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిన వెంటనే వాటిని సమకూర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చేసుకున్న ఒప్పందాల్లో 89 శాతం మేర కంపెనీలకు రియల్‌ టైంలోకి తీసుకురాగలిగామని, ఇప్పుడు కూడా 80 శాతం నుండి 90 శాతం వరకూ ఎంవోయూలు చేసుకున్న కంపెనీలన్నీ తమ తమ పెట్టుబడులను పెట్టేలా కార్యరూపంలోకి తీసుకురావాలని సీఎం జగన్‌ గట్టి సంకల్పంతో వేగంగా అడుగులు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమేరకు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement