Thursday, April 25, 2024

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. ఇతర పాలనా పరమైన విషయాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

అలాగే సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్సుంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ అంశంపై కూడా స్పష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశముంది. అలాగే పోడు భూముల పట్టాల అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement