Saturday, April 27, 2024

Memantha Siddham – తప్పులు ఉంటే చెప్పండి… సరిదిద్దుకుంటాం – జగన్


చంద్రబాబుకు వెన్నుపోటు కొత్త కాదు
ఆయనను నమ్మితే మోసం తప్పదు
మనం నట్టేట మునుగుతాం
130 సార్లు బటన్ నొక్కా
మీరు రెండు బటన్ లు నొక్కండి
మీరే స్టార్ క్యాంపైనర్లు
ప్ర‌జ‌ల‌తో ముఖాముఖీలో సీఎం జ‌గ‌న్‌

(కర్నూలు బ్యూరో, ప్రభ న్యూస్) – తప్పులుంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం, వెన్నుపోటు చంద్రబాబును మాత్రం నమ్మవద్దు, సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడం కొత్తేమి కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆళ్లగడ్డలో బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ, మరోసారి ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు కల్లబొల్లి పాటలతో చంద్రబాబు ముందుకు వస్తున్నారని ఆయనను నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవస్థల్లో లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్‌సీపీ ముందుకెళుతోందన్నారు.ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుక తిరుగుతోందన్నారు. ప్రజల అజెండాగా రెపరెపలాడుతుందన్నారు.

పేదల కోసం 130 సార్లు బటన్ నొక్కాను

పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్‌ నొక్కాను. మే 13వ తేదిన ఫ్యాన్‌ గుర్తుపై రెండు మార్లు బటన్‌ నొక్కండి చాలు అన్నారు. మరో వంద మందికి ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలనీ పిలుపునిచ్చారు. రాబోయే 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని జగన్ పిలుపునివ్వగా..సిద్ధం అని జనం నినాదాలు ఆ ప్రాంతంలో దద్దరిల్లాయి.అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయమన్నారు.

మీరే స్టార్ క్యాంపెయినర్లు

ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్‌ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదన్నారు. పొరపాటు జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడమే అన్నారు. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటుకు గురికాక తప్పదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

ప్రతిపక్షాల మాటలు నమ్మోద్దు : ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి

గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కూడా మేము ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతుంటే.జ ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి అని ఎమ్మెల్యే గంగుల జిజేంద్ర రెడ్డి అన్నారు. ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారన్నారు.

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం

అంతకుముందు ఆళ్లగడ్డబత్తులూరు సమీపంలో మేమంతా సిద్ధం యాత్ర లో భాగంగా సీఎం జగన్‌ కోసం బత్తులూరు ప్రజల ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అంబులెన్స్ ను చూసి ముఖ్యమంత్రి బస్సు కాన్వాయ్ అంబులెన్స్ కు సైడ్ ఇచ్చి.. తమ మానవత్వాన్ని చాటుకోవడం విశేషం.అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement