విశాఖపట్నంలో తూర్పు నౌకదళం ఆధ్వర్యంలో ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో నిర్మిస్తున్న యుద్దనౌక ఐఎస్‌ఎస్ విశాఖను త్వరలోనే ప్రారంభించనున్నారని, ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4న జరిగే నేవీడే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తూర్పునావికాదళాధికారులు ఆహ్వానించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలను వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్దవంతంగా అమలు చేస్తోందన్నారు. 2021-22 సంవత్సరానికి ఏపీకి రెండు విడతల్లో కేటాయించిన 21.67 కోట్ల పనిదినాలను పూర్తిగా వినియోగించుకుందని, దీంతో తాజాగా మరో 1.83 కోట్ల అదనపు పనిదినాలను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా వంటనూనెల ధరలు తగ్గడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం లభించిందన్నారు. ఫామ్ ఆయిల్, సన్ ప్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ లపై దిగుమతి సుంకాలు హేతుబద్దీకరణ చేయడం, స్టాక్ పరిమితి విధించడం మొదలగు చర్యలు ఫలితంగా వంటనూనెల ధరలు తగ్గాయన్నారు.
ప్రజా సంకల్పయాత్ర ఓ రికార్డు :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు నాడు ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ నేత చేయని విధంగా రికార్డు స్థాయిలో 341 రోజులు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనస్సు గెలుచుకున్నారని, ఫలితంగా ప్రజలు తమ అభిమాన నేతకు రికార్డు స్థాయిలో విజయాన్నందించి ముఖ్యమంత్రిని చేసారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా సంకల్పయాత్ర చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కోన్నారు. దృఢమైన సంకల్పబలంతో మరువలేని మరోయజ్ఞంగా సాగిన పాదయాత్రను గుర్తుచేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలు చేపట్టారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సమయంలో మంచు చరియలు విరిగిపడి మృతి చెందిన చిత్తూరు జిల్లా బంగారు వాండ్లపల్లెకు చెందిన ఆర్మీ జవాన్ కీర్తీక్ కుమార్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పేర్కోన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్ కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలు, ప్రభుత్వం తోడుంటుందన్నారు. భారత ప్రభుత్వం కాశ్మీర్ యువత కోసం ఏర్పాటు చేసిన మిషన్ యూత్ లో భాగంగా కాశ్మీర్ లోని ప్రతిపంచాయతీ, అర్బన్ వార్డులలో మెత్తం 4200 క్లబ్ లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. క్లబ్బులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువత నిర్మాణాత్మక కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటారని, తద్వారా అభివృద్ది సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్రమోడీ ఆద్వర్యంలో భారత్ భూటాన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేసేందుకు అదనంగా ఏడు ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. 2014 నుండి జరుగుతున్న 484 మిలియన్ డాలర్ల వ్యాపారం 2020-21 సంవత్సరానికి 1083 మిలియన్ డాలర్ల వ్యాపారానికి చేరుకొని అమాంతం రెట్టింపు అయ్యిందని అన్నారు.
పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి :
భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం ఏనుగుల పాలెంలో లైన్‌మెన్ బంగ్రారాజు హత్య జరిగిన ఘటన చాలా దురుదృష్టకరమని, బంగార్రాజు మృతి ఎంతో భాదించిందని మరో ట్విట్‌లో పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతూ, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, అపోహలు వద్దని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ప్రసక్తే లేదన్నారు.
త్వరలోనే ఐఎన్‌ఎస్ యుద్ద నౌక : ఎంపీ విజయసాయిరెడ్డి

Advertisement
తాజా వార్తలు
Advertisement