Tuesday, May 28, 2024

Indrakiladri – శ్రీ దుర్గా దేవి అలంకరణలో శ్రీ కనకదుర్గమ్మ..వైభవంగా ఎనిమిదవ రోజు శరన్నవరాత్రి వేడుకలు..

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్టించి బంగారు కిరీటంతో అమ్మవారు తన కాళ్ళు కింద దుర్గమసురుడనే రాక్షసుడు ని తొక్కిపెట్టి ఉంటే దివ్య రూపమే శ్రీ దుర్గా దేవి. ఆదిపరాశక్తి అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ స్వరూపిణిగా అవతరించిన దివ్యమైన క్షేత్రం అయిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులను కటాక్షిస్తున్నారు.

దుర్గగుడు అనే రాక్షసుడు ని అష్టమి తిధి రోజున సంహరించిన రోజు కాబట్టే అమ్మవారు శ్రీ దుర్గా దేవిగా కీర్తించబడతారు. అమ్మవారిని దుర్గాష్టమి నాడు ఆరాధించడం ఎంతో విశిష్టమైనదిగా దేవి భాగవతంలో చెప్పబడింది. దుర్గాదేవి నామాన్ని స్మరించినా, ప్రార్ధించినా, జపించినా అమ్మవారు కష్టం, దరిద్రం లేకుండా సంపదలను, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఎర్ర పుస్తకం, ఎర్రని దుస్తులతో చిత్రాన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తూ, అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున నేడు పూజిస్తారు.

శ్రీ దుర్గా దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం క్యూలైన్ల ద్వారా వినాయక గుడి దగ్గర నుండి పైకి చేరుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి తరలివస్తున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్ర గిరిలు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత సంతరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement