Monday, April 29, 2024

ప్రాజెక్టుల‌కు పెరిగిన ఇన్‌ఫ్లో.. ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద కొన‌సాగుతున్న మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లు పొంగిపోతున్నాయి. వరద నీరు భారీగా వస్తుండటంతో ప్రధాన జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతుండటంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 4,12,769 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,32,723 క్యూసెక్కులు గా న‌మోద‌వ్వ‌గా, ఔట్ ఫ్లో 3,35,786 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మొత్తం 885 అడుగులకు గాను ప్రాజెక్టు నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ 215.8070 టీఎంసీల వద్ద 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయం 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 38,567 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 32,402 క్యూసెక్కులుగా నమోదవుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, మొత్తం 105.788 టీఎంసీలకు గాను 104.383 టీఎంసీల నీరు నిండి ప్రస్తుతం 1632.65 అడుగులకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement